ఎవరి మద్దతు అవసరం లేదు.. గెలుపుపై బీజేపీ ధీమా.. డీలాపడిన కాంగ్రెస్!
Recommended Video

కర్ణాటకలో స్పష్టమైన మెజారిటీ దిశగా బీజేపీ దూసుకెళ్తున్నది. తొలుత హంగ్ ఏర్పడుతుందనే భావించిన విశ్లేషకులకు కన్నడ ఫలితాలు షాకిచ్చాయి. కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటుపై కూడా ఓటర్లు ఆసక్తిచూపలేదనేది ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తున్నాయి.

ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టి
ఓటర్లు అందించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొన్నేందుకు బీజేపీ పార్టీ యంత్రాంగం చకచకా పావులు కదుపుతున్నది. బీజేపీ చీఫ్ అమిత్ షాతో సమావేశమైన తర్వాత పార్టీ నేత ప్రకాశ్ జవదేకర్ బెంగళూరు చేరుకొన్నారు. ఒకవేళ హంగ్ ఏర్పడితే ఏం చేయాలనే వ్యూహంపై పార్టీ నేతలతో చర్చల్లో మునిగిపోయారు.

సొంతంగానే ప్రభుత్వం
బీజేపీ గెలుపుపై సీనియర్ బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి సదానంద గౌడ ధీమా వ్యక్తం చేశారు. జేడీఎస్‌తో పొత్తు లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. మాకు ఎలాంటి పొత్తు అవసరం లేదు. కర్ణాటకలో బీజేపీ విజయం మాదే అని సదానంద గౌడ్ అన్నారు.

ఆ మూడు రాష్ట్రాలు మావే
త్వరలో జరుగబోయే ఛత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల్లో కూడా విజయం మాదే అని బీజేపీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే 21 రాష్ట్రాలను సొంతం చేసుకొన్న బీజేపీ విజయ గర్వంతో దూసుకెళ్తున్నది.

కాంగ్రెస్ డీలా
ఫలితాల అనంతరం హంగ్‌కు అవకాశం ఏర్పడితే ప్రభుత్వాన్ని ఏర్పాటు దిశగా కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేశారు. సీనియర్ నేతలు అశోక్ గెహ్లాట్, ఆజాద్ బెంగుళూరులో మకాం వేసి పరిస్థితిని అంచనావేస్తున్నారు. సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గేతో కలిసి తాజా ఫలితాలపై విశ్లేషిస్తున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రతికూలంగా రావడంతో కాంగ్రెస్ కార్యకర్తలు డీలా పడ్డారు.
-
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
3,000 పెన్షన్, ఉచితంగా ఎల్పీజీ సిలిండర్లు.. కేరళలో బీజేపీ మేనిఫెస్టో ఇదే.. -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications