Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఓటు వెయ్యకముందే లేడీకి పబ్లిక్ గా ముద్దు పెట్టిన ఎంపీ అభ్యర్థి, యువతి పక్కా క్లారిటీ!

భారతదేశంలో లోక్ సభ ఎన్నికల వేడితో ఉత్కంఠ నెలకొంది. ఓట్ల వేట కోసం ఎంపీ అభ్యర్థులు రకరకాల వ్యూహాలను అనుసరిస్తారు. అభ్యర్థులు ఓటర్ల దృష్టిని ఆకర్షించడానికి నానాపాట్లు పడుతున్నారు. కొందరు అయితే పొలాల్లో దిగి పనిచేస్తున్న రైతు కూలీలతో ఫోటోలకు ఫోజులు ఇచ్చి వార్తల్లో నిలుస్తారు. ఇలాంటి చిత్రాలను మీరు తరచుగా సోషల్ మీడియాలో చూస్తుంటారు.

అయితే ఇక్కడ బీజేపీ ఎంపీ అభ్యర్థి చేసిన పని మనం మరెక్కడా చూడడం కష్టమే అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ నార్త్ మాల్డా అభ్యర్థి ఖగెన్ ముర్ము ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో బీజేపీ అభ్యర్థి ఓ యువతిని ముద్దుపెట్టుకుంటున్న దృశ్యాన్ని కొందరు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో ఆ ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను అడ్డం పెట్టుకుని విపక్షాలు బీజేపీని ఏకిపారేస్తున్నాయి.

BJP MP candidate who openly kissed a young woman during the election campaign

లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌లోని ఉత్తర మాల్దా జిల్లా శ్రీహిపురా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా ఖగెన్ ముర్మును బీజేపీ హైకమాండ్ ఇప్పటికే ప్రకటించింది. ఈ వైరల్ ఫోటోపై టీఎంసీ జిల్లా ఉపాధ్యక్షుడు దులాల్ సర్కార్ బీజేపీ అభ్యర్థి ఖగెన్ ముర్మును విమర్శించారు. ఈ ఫోటోలను టీఎంసీ అభ్యర్థి సోషల్ మీడియాలో షేర్ చేశారు. సోషల్ మీడియా సైట్‌లో బీజేపీ అభ్యర్థిని లక్ష్యంగా చేసుకుని అతను పెద్ద కామాంధుడు అంటూ ప్రచారం చేస్తున్నారు.

ఈ ఫోటో వైరల్ కావడంతో బీజేపీ అభ్యర్థి ఖగెన్ ముర్ము కూడా క్లారటీ ఇచ్చారు. ఆ యువతిని నా కూతురు లాంటిది అంటూ అభివర్ణించారు. తన కూతురిని ముద్దు పెట్టుకోవడంలో తప్పేమీ లేదన్నారు. ఈ ఫోటో వైరల్ గా మారి బెంగాల్ రాజకీయాల్లో కలకలం రేపింది. ఈ విషయంలో బీజేపీ అభ్యర్థిని టార్గెట్ చేస్తూ టీఎంసీ ఓ పోస్ట్ చేసింది. పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తన సోషల్ మీడియాలో బీజేపీ అభ్యర్థి ఖగెన్ ముర్ము ఓ యువతిని ముద్దుపెట్టుకుంటున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

మాల్డా ఉత్తర లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన బీజేపీ అభ్యర్థి ఖగెన్ ముర్ము ఓ యువతిని బహిరంగంగా ముద్దు పెట్టుకోవడం బెంగాలీ సంస్కృతికి విరుద్ధం అని, ఓట్లు అడిగే సమయంలో ఇలాంటి ఘటనలు జరిగాయని, గెలిచిన తర్వాత ఆయన మనస్థితి ఏంటని ప్రజలు అర్థం చేసుకోవాలని దులాల్ సర్కార్ ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తికి ఓటు వేస్తే మహిళలు, యువతులు రోడ్ల మీద బహిరంగంగా తిరగడానికే భయపడే రోజులు వస్తాయని టీఎంసీ నాయకులు ఆరోపించారు.

BJP MP candidate who openly kissed a young woman during the election campaign

బీజేపీ అభ్యర్థి ఖగెన్ ముర్ము ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు. ఈ ఫోటో వైరల్‌గా మారడంతో బీజేపీ అభ్యర్థి ఖగెన్ ముర్ము టీఎంసీ నాయకులపై మండిపడ్డారు. ఇదొక కుట్ర, ఇలాంటి ఫొటోలను తారుమారు చేస్తూ పార్టీలు, వ్యక్తుల పరువు తీస్తున్నారని, తృణమూల్ కాంగ్రెస్‌పై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామని బీజేపీ ఎంపీ అభ్యర్థి ఖగెన్ ముర్ము హెచ్చరించారు. ఆ అమ్మాయి నాకు కూతురు లాంటిదని, అందులో తప్పేముందని, ఆమె తన కళ్ల ముందు ఓ చిన్నపిల్ల అని, చిన్నారిని ముద్దుపెట్టుకోవడంలో తప్పేమీ లేదని స్పష్టం చేశారు.

ఈ విషయంలో ఆ యువతి కూడా స్పందించారు. బీజేపీ అభ్యర్థి మా బంధువు అని, చిన్నప్పటి నుంచి అతన్ని నేను చూస్తున్నానని, తాను ఆయనకు కూతురిలాంటిదాన్ని అని, ఆయనకు వేరే ఉద్దేశం లేదని, నా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తాను బాధపడ్డానని ఆ యువతి చెప్పిందని స్థానిక మీడియా తెలిపింది. ఇలాంటి ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేసి ఎన్నికల లబ్దీ పొందాలని అనుకుంటున్న వాళ్ల బుద్ది డర్టీ మైండ్ అని ఆ యువతి మండిపడుతోందని స్థానిక మీడియా తెలిపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+