వైరల్ వీడియో: బీజేపీ ఎంపీపై రాళ్ల దాడి.. తలకు తీవ్ర గాయాలు..
బీజేపీ ఎంపీపై ప్రజలు రాళ్లదాడి చేశాడు. ఈ దాడిలో ఎంపీ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ జల్ పాయ్ గురిలో జరిగింది. బీజేపీ ఎంపీ ఖగేన్ ముర్ము.. నార్త్ బెంగాల్ లో వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లారు. దీంతో అతడ్ని స్థానిక ప్రజలు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ముర్ము తీవ్రంగా గాయపడ్డారు. ఇదే ఘటనపై అధికార టీఎంసీ పార్టీపై బీజేపీ విమర్శలు గుప్పించింది. ప్రజలు వరదలు, కొండచరియలు విరిగిపడి ఆందోళనతో ఉన్న సమయంలో వారికి అండగా నిలుస్తూన్న బీజేపీ నేతలపై దాడులకు పాల్పడుతోందని మండిపడింది.
పశ్చిమ బెంగాల్ లోని ఉత్తర మాల్దాకు చెందిన బీజేపీ ఎంపీ ఖగేన్ ముర్ము.. మాల్దాలో ఇప్పటికే రెండుసార్లు ఎంపీగా గెలుపొందారు. అయితే తాజాగా ఉత్తర బెంగాల్ లో ముర్ము పర్యటించిన నేపథ్యంలో స్థానికులు రాళ్లతో అతడిపై దాడికి పాల్పడ్డారు. జల్ పాయ్ గురిలోని దోవర్స్ ప్రాంతం నుంచి నగ్రాకటా ప్రాంతానికి వెళ్తున్న క్రమంలో ఈ దాడి జరిగింది. ముర్మును చూసిన స్థానికులు అతడి కాన్వాయ్ పై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో అతడి తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. అతడి షర్టు మొత్తం రక్తంతో ఉంది. అయితే ఈ దాడిని బీజేపీ ఖండించింది. తమ పార్టీ నేతలపై టీఎంసీ దాడులకు పాల్పడుతోందని మండిపడింది.
TMC’s Jungle Raj in Bengal!
— Amit Malviya (@amitmalviya) October 6, 2025
BJP MP Khagen Murmu, a respected tribal leader and two-time MP from North Malda, was attacked by TMC goons while on his way to Nagrakata in Jalpaiguri’s Dooars region to help with relief and rescue efforts after devastating rains, floods, and… pic.twitter.com/pqpd9Vyrk9
దాడి ఘటనకు సంబంధించిన వీడియోను బీజేపీ ఐటీ సెల్ విభాగం.. ఎక్స్ లో పోస్టు చేసింది. "బీజేపీ ఎంపీ ఖగేన్ ముర్ము.. రెండు సార్లు ఎంపీగా గెలుపొందారు. గిరిజన నేతగా మంచి గుర్తింపు ఉంది. ఆయన వరద బాధితులను పరామర్శించేందుకు నగ్రాకటా వెళ్తుండగా టీఎంసీ గూండాలు అతడిపై దాడికి పాల్పడ్డారు. ప్రజలు వరదలు, కొండ చరియలు విరిగిపడి తీవ్ర ఇబ్బందులు పడుతుంటే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాత్రం కోల్ కతా కార్నివాల్ లో సంతోషంగా పాల్గొంటున్నారు. బీజేపీ మాత్రమే ప్రజలకు సాయం చేస్తోంది"

ఉత్తర బెంగాల్ లో వరదల కారణంగా ఇప్పటివరకు 23 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. డార్జీలింగ్, జల్పాయ్ గురి ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో స్థానిక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక ముర్ము ఘటనపై వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఇప్పటివరకూ స్పందించలేదు. ఈ ఘటనతో రాష్ట్రంలో రాజకీయ వాతవారణం మరోసారి వేడెక్కనుంది.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications