ఉత్తర ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన: హస్తిన వేదికగా శరవేగంగా మారుతున్న పరిణామాలు
లక్నో: ఇంకొద్ది నెలల్లో దేశంలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం నెలకొనబోతోంది. రెండు నెలల్లో దీనికి సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పాలనలో ఉన్న పంజాబ్ సహా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లల్లో ఇప్పటికే ప్రచార వేడి రాజుకుంది. అన్ని రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. బీజేపీకి ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్ఠాత్మకం.

యూపీ ప్రతిష్ఠాత్మకం
ఎన్నికల ప్రచారంలో భాగంగానే- ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పటికే ఉత్తర ప్రదేశ్‌లో పలుమార్లు పర్యటించారు. వందల కోట్ల రూపాయల విలువ చేసే ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఉత్తర ప్రదేశ్‌లో వరుసగా రెండోసారి అధికారంలోకి రావడానికి బీజేపీ సర్వశక్తులను మోహరింపజేస్తోంది. చేతిలో ఉన్న అధికారాన్ని నిలబెట్టుకోవడంతో పాటు పంజాబ్‌లో పాగా వేయడానికి సమాయాత్తమౌతోంది. ఇక ప్రతిపక్ష పార్టీలన్నీ ఉమ్మడి శతృవును బీజేపీని ఢీకొట్టడానికి రంగం సిద్ధం చేసుకుంటోన్నాయి.

బాంబు పేల్చిన సుబ్రహ్మణ్య స్వామి..
ఈ పరిణామాల మధ్య బీజేపీకే చెందిన రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి బాంబు పేల్చారు. ఉత్తర ప్రదేశ్‌లో ఎన్నికలు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని తేల్చి చెప్పారు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు మొదలు పెట్టినట్లు తనకు సమాచారం ఉందని స్పష్టం చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ వరకు అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలనే దిశగా కేంద్రం పావులు కదుపుతోందని, త్వరలోనే దీనికి సంబంధించిన సమాచారంపై మరింత స్పష్టత రావొచ్చని పేర్కొన్నారు.

తెల్లవారుజామునే ట్వీట్..
ఈ మేరకు ఈ తెల్లవారు జామున ఆయన ఓ ట్వీట్ చేశారు. తెల్లవారు జామున 4:22 నిమిషాలకు ఆయన ఈ ట్వీట్ చేయడాన్ని బట్టి చూస్తోంటే.. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం, ఒమిక్రాన్ వేరియంట్ విస్తృతం కావడం వంటి పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్రం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం- ఈ దిశగా కీలక నిర్ణయాన్ని తీసుకోవడానికి ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.

వాయిదా వేసేలా..
త్వరలోనే కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయానికి ఓ వినతిపత్రాన్ని పార్టీ తరఫున అందజేసే అవకాశాలు ఉన్నాయని సుబ్రహ్మణ్య స్వామి చెప్పారు. ఉత్తర ప్రదేశ్‌లోని అలహాబాద్ హైకోర్టు సైతం ఇదేరకమైన సూచన చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కరోనా వైరస్, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వచ్చే ఏడాది నిర్వహించ తలపెట్టిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేసేలా చర్యలు తీసుకోవాలని అలహాబాద్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచనలు చేసింది.
Recommended Video

థర్డ్ వేవ్ సంభవించే అవకాశం..
ఈ ఏడాది అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తరువాత కరోనా వైరస్ పాజిటివ్ కేసుల తీవ్రత పెరిగిన విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అస్సాంలల్లో అసెంబ్లీ ఎన్నికల తరువాత సెకెండ్ వేవ్ సంభవించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో థర్డ్‌వేవ్ సంభవిస్తుందంటూ నిపుణులు చేస్తోన్న హెచ్చరికలను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవచ్చని అంటున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ వల్ల నైట్ కర్ఫ్యూలు, ఆంక్షలను విధించే పరిస్థితులు దేశంలో నెలకొన్నందున- ఎన్నికలను వాయిదా వేయడానికే కేంద్రం మొగ్గు చూపుతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications