Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

యాక్ట్ ఆఫ్ సెక్స్: అరబ్ మహిళల సెక్స్ లైఫ్‌, ఆర్గజమ్స్‌పై బీజేపీ యంగ్ ఎంపీ షాకింగ్ కామెంట్స్

బెంగళూరు: కర్ణాటక భారతీయ జనతా పార్టీ నాయకుడు, యంగ్ ఎంపీ తేజస్వి సూర్య వివాదాల్లో చిక్కుకున్నారు. అరబ్ దేశాలకు చెందిన మహిళపై సెక్స్ లైఫ్‌ను టార్గెట్‌గా ఆయన చేసిన ఓ ట్వీట్ దుమారాన్ని రేపుతోంది. అటు అరబ్ దేశాల్లోనూ ఈ ట్వీట్ ప్రకంపనలను పుట్టించింది. తేజస్వి సూర్యపై చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అరబ్ దేశాల నుంచి పలువురు ప్రముఖులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేస్తున్నారంటే.. ఈ ట్వీట్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ట్వీట్‌పై పెద్దఎత్తున విమర్శలు చెలరేగడంతో దాన్ని డిలెట్ చేశారాయన.

95 శాతం మంది అరబ్ మహిళల సెక్స్ లైఫ్‌పై

95 శాతం మంది అరబ్ మహిళల సెక్స్ లైఫ్‌పై

అరబ్ దేశాలకు చెందిన 95 శాతం మంది మహిళలకు ఆర్గజమ్స్ ఉండవని తేజస్వి సూర్య పేర్కొన్నారు. శృంగార సమయంలో అరబ్ మహిళలు ఉద్వేగానికి లోను కారని, యాంత్రికంగా సెక్స్‌లో పాల్గొంటారనే అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు. 500 సంవత్సరాలుగా అరబ్ దేశాల్లో ఇదే తీరు కొనసాగుతోందని అన్నారు. వారంతా ప్రేమతో పిల్లలను కనట్లేదని చెప్పారు. బిడ్డలను ఉత్పత్తి చేస్తున్నారని కామెంట్స్ చేశారు. యాక్ట్ ఆఫ్ సెక్స్ ద్వారా వారు పిల్లల్ని ఉత్పత్తి చేస్తున్నారే తప్ప.. ప్రేమతో కాదని తేజస్విసూర్య అభిప్రాయపడుతూ ట్వీట్ చేశారు. దీన్ని పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ జర్నలిస్టు, కాలమిస్ట్ తారెక్ ఫతాకు ట్యాగ్ చేశారు.

అరబ్ దేశాల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు..

అరబ్ దేశాల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు..

తేజస్వి సూర్య చేసిన ఈ ట్వీట్ దుమారాన్ని రేపింది. అరబ్ దేశాల నుంచి ఆయనపై కౌంటర్ అటాక్ ఆరంభమైంది. ఆయా దేశాలకు చెందిన పలువురు ఫెమినిస్టులు, కొందరు ప్రముఖులు ఈ కామెంట్స్‌కు స్పందించారు. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఫిర్యాదులు చేశారు.ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా బీజేపీ ఎంపీ కామెంట్స్ చేశారని అన్నారు. ఆయన మనస్తత్వాన్ని, మహిళల పట్ల ఆయనకు ఉన్న భావాలను ఒక్క ట్వీట్ ద్వారా వెల్లడించారని చెప్పారు. మహిళలను కించపరిచే వారిని క్షమించకూడదని డిమాండ్ చేశారు.

Recommended Video

    Cricketers Serious People Stupidity

    మరో ఎంజే అక్బర్‌లా తయారయ్యారంటూ..


    ఈ ట్వీట్‌పై కర్ణాటక కాంగ్రెస్ నాయకులు విమర్శలు గుప్పించారు. తేజస్వి సూర్య మరో ఎంజే అక్బర్‌లాగా మారారని ఆరోపించారు. బీజేపీలో ఎలాంటి నాయకులు ఉన్నారో ఈ ఉదంతం స్పష్టం చేస్తోందని మండి పడ్డారు. మీటూ ఉద్యమంలో లైంగిక ఆరోపణలను ఎదుర్కొన్న ఎంజే అక్బర్‌ను కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించారని, ఇక తేజస్వి సూర్యపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఎంజే అక్బర్, తేజస్వి సూర్య వంటి నాయకులను బీజేపీ తయారు చేసి, సమాజం మీదికి వదిలేస్తోందని అన్నారు. ఈ కామెంట్స్‌ను బెంగళూరు దక్షిణ నియోజకవర్గం ప్రజలు గుర్తుంచుకుంటారని అన్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+