ఎంపీ మేడమ్ ఇంటికి నేరుగా వెళ్లిన బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, రేసులో మాజీ సీఎం ఫ్యామిలీ, ఏం జరిగింది ?
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కర్ణాటకకు చెందిన బీజేపీ నాయకురాలు, సిట్టింగ్ ఎంపీ మంగళ అంగడి నివాసానికి వెళ్లడం హాట్ టాపిక్ అయ్యింది. బెళగావి లోక్ సభ బీజేపీ సీటు ఎవరికి ఇస్తారు అంటూ బీజేపీ కార్యకర్తల్లో చర్చ మొదలైయ్యింది. మంగళవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు బెళగావిలోని మంగళ అంగడి ఇంటికి చేరుకుని గంట పాటు చర్చించడం రాజకీయంగా హాట్ టాపిక్ అయ్యింది.
బెళగావి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు బీజేపీ టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొని ఉన్న నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బీజేపీ సిట్టింగ్ ఎంపీ మంగళ సురేశ్ అంగడి ఇంటికి వెళ్లడంతో ఎంపీ టిక్కెట్ కోసం ఆశపడుతున్న పలువురు నాయకుల ఊహాగానాలకు ఆజ్యం పోసినట్లు అయ్యింది. బీజేపీ హైకమాండ్ ఇప్పటికే 195 మంది లోక్ సభ నియోజకవర్గాల అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. రెండో జాబితాలో కర్ణాటక అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని ఇప్పటికే బీజేపీ హైకమాండ్ చెప్పింది.

రెండో జాబితా ప్రకటించకముందే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కర్ణాటక పర్యటన హాట్ టాపిక్ అయ్యింది. మాజీ కేంద్ర మంత్రి సురేష్ అంగడి కుటుంబానికి ఈసారి కూడా టిక్కెట్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బీజేపీ వర్గాలు తెలిపాయి. మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్, ఆయన కూతురు శ్రద్ధా శెట్టర్, విధాన పరిషత్ చీఫ్ విప్ మహంతేష్, బెళగావి డివిజన్ మాజీ రీజనల్ కమిషనర్ ఎంజీ హిరేమఠ్, సిట్టింగ్ ఎంపీ మంగళ అంగడి, స్పూర్తి పాటిల్ బెళగావి బీజేపీ టికెట్ కోసం పోటీ పడుతున్నారు.
అయితే మంగళ అంగడి ఇంటిలో జేపీ నడ్డా ప్రత్యక్షం కావడం పలు అనుమానాలకు దారితీసింది. ఇప్పటికే బెళగావి లోక్ సభ టికెట్ ఆశించే వారి సంఖ్య పెరిగింది. చాలా మంది నాయకులు ఎంపీ టికెట్ కోసం డిమాండ్ చేస్తున్నారు. బెళగావి ఎంపీ అభ్యర్థిని ఎంపిక చేయడంలో బీజేపీ హైకమాండ్ ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. ఇదే సమయంలో బెళగావి బూత్ స్థాయి కార్యకర్తల కోర్ కమిటీ సమావేశానికి జేపీ నడ్డా హాజరయ్యారు.

బెళగావి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బీజేపీ హైకమాండ్ ఎవరిని ఎంపిక చేసినా వారికే పని చేయాలని పార్టీ హైకమాండ్ బీజేపీ కార్యకర్తలకు సూచించింది. బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ జేపీ నడ్డా కొంత సమయం కేటాయించి బీజేపీ ఎంపీ మంగళ అంగడి ఇంటికి వెళ్లి గంటకు పైగా అక్కడ గడిపి వివిద ఆంశాలపై చర్చించారని తెలిసింది. బెళగావిలోని మంగళ అంగడి కుటుంబ సభ్యులు, హుబ్బళికి చెందిన మాజీ సీఎం జగదీష్ శెట్టర్ కుటుంబ సభ్యులు బెళగావి లేదా హుబ్బళి లోక్ సభ సీటు కోసం బీజేపీ హైకమాండ్‌తో గట్టిగా లాబీయింగ్ చేస్తున్నారు. స్పూర్తి పాటిల్, శ్రద్ధా శెట్టర్‌లు బెళగావి టికెట్ కోసం బలమైన అభ్యర్థులుగా చెబుతున్నారు. జేపీ నడ్డా బెళగావి పర్యటన సందర్బంగా వీరిలో ఎవరికో ఒకరికి టిక్కెట్ వస్తుందని బీజేపీ సీనియర్ నాయకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications