వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాలి జనార్దన్ రెడ్డి అడగులేదు, మేము ఇవ్వలేదు, శత్రువు సహాయం తీసుకుంటాం: బీజేపీ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి బీజేపీని టిక్కెట్ అడగలేదు, పార్టీ ఆయనకు బీఫాం ఇవ్వలేదని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర బీజేపీ శాఖ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్ప అన్నారు. గాలి జనార్దన్ రెడ్డి ఎందుకు ఎన్నికల్లో పోటీ చెయ్యలేదు అని హాసన్ లో విలేకరులు ప్రశ్నించగా బీఎస్. యడ్యూరప్ప ఈ విధంగా సమాధానం ఇచ్చారు.

రెడ్డితో బీజేపీకి మేలు

రెడ్డితో బీజేపీకి మేలు

కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి సహాయంతో ఉత్తర కర్ణాటక బాగంలో బీజేపీకి 10 నుంచి 15 వరకు ఎమ్మెల్యే సీట్లు వస్తాయని మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప మీడియాకు చెప్పారు. గాలి జనార్దన్ రెడ్డి వలన బీజేపీకి మేలు జరుగుతుందని బీఎస్. యడ్యూరప్ప అభిప్రాయం వ్యక్తం చేశారు.

అమిత్ షా చెప్పారు

అమిత్ షా చెప్పారు

బీజేపీకి లాభం వస్తుందని అనుకుంటే ఎంత శత్రువులు అయినా వారి సహాయం తీసుకోవాలని మా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా చెప్పారని, అది మాకే లాభం అని మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప మీడియాకు చెప్పారు.

బీజేపీకి రెడ్డి సేవ చేశారు

బీజేపీకి రెడ్డి సేవ చేశారు

గాలి జనార్దన్ రెడ్డి గతంలో బీజేపీకి సేవ చేశారని, ఆయన మద్దతు ఇస్తానంటే పార్టీ నిరాకరించడం సాధ్యం కాదని బీఎస్. యడ్యూరప్ప సమర్థించుకున్నారు. శాసన సభ ఎన్నికల్లో బీజేపీకి గాలి జనార్దన్ రెడ్డి నుంచి లాభం వస్తుంది అంటే రానివ్వండి, ఎవరు వద్దంటున్నారు అని బీఎస్. యడ్యూరప్ప అన్నారు.

కాంగ్రెస్ చివరి సీఎం

కాంగ్రెస్ చివరి సీఎం

సీఎం సిద్దరామయ్య నోటీకి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ పార్టీకి ఆయనే చివరి ముఖ్యమంత్రి అని బీఎస్. యడ్యూరప్ప వ్యంగంగా అన్నారు. ఓడిపోతామనే భయంతో సిద్దరామయ్య మతిలేకుండా మాట్లాడుతున్నారని, తాము జేడీఎస్ తో ఎలాంటి పరిస్థితిలో లోలోపల ఒప్పదం చేసుకోమని బీఎస్ యడ్యూరప్ప స్పష్టం చేశారు.

తండ్రి, కొడుకు వద్దు

తండ్రి, కొడుకు వద్దు

మీ కుమారుడు విజేంద్రకు వరుణా నియోజక వర్గంలో పోటీ చెయ్యడానికి ఎందుకు సీటు ఇవ్వలేదని మీడియా ప్రశ్నించగా తండ్రి, కుమారుడు పోటీ చెయ్యడం ఎందుకు అనుకున్నామని, హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకుందని బీఎస్. యడ్యూరప్ప వివరించారు. ఈ ఎన్నికలను తాము చాలెంజ్ గా తీసుకున్నామని బీఎస్. యడ్యూరప్ప అన్నారు.

English summary
BJP not given ticket for Gali Janardhan Reddy says BS Yeddyurappa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X