మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్
అస్సాం (Assam)లో అసెంబ్లీ ఎన్నికల వ్యవహారం పొలిటికల్ హీట్ రాజేస్తోంది. అస్సాంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఏప్రిల్ 9న పోలింగ్ జరగనుండగా, మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం హిమంత బిశ్వ శర్మ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. గౌహతిలోని పార్టీ కార్యాలయంలో 'సంకల్ప పత్రం' పేరుతో ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అస్సాం బీజేపీ అధ్యక్షుడు దిలీప్ సైకియా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు.
భారీ హామీలతో 'సంకల్ప పత్రం'..
ఈ మేనిఫెస్టోలో మొత్తం 31 కీలక హామీలను ప్రకటించిన బీజేపీ, తిరిగి అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధికి ₹5 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా యువత, మహిళలు, రైతులు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి పెట్టినట్లు పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా Uniform Civil Code (యూసీసీ) అమలు చేస్తామని హామీ ఇచ్చింది. అయితే రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ పరిధిలో ఉన్న ప్రాంతాలు, షెడ్యూల్డ్ తెగల ప్రాంతాలకు మినహాయింపు ఉంటుందని సీఎం స్పష్టం చేశారు.

మేనిఫెస్టోలో ముఖ్యాంశాలు..
- ఉద్యోగాలు, ఆర్థికాభివృద్ధి
- రాబోయే ఐదేళ్లలో 2 లక్షల ఉద్యోగాల కల్పన
- పరిశ్రమలు, ఐటీ, వ్యవసాయ రంగాల్లో పెట్టుబడులు పెంపు
- యువతకు స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్
- 'అరుణోదయ' పథకం కింద మహిళలకు నెలకు ₹3,000 ఆర్థిక సహాయం
- 'లఖ్‌పతి దీదీ' పథకం ద్వారా 40 లక్షల మహిళలకు ఆర్థిక ప్రోత్సాహం
- స్వయం ఉపాధి అవకాశాల పెంపు
- భద్రత, చట్టవ్యవస్థ
- 'లవ్ జిహాద్'పై కఠిన చర్యలు
- 'భూ జిహాద్'కు ముగింపు పలుకుతామని హామీ
- అక్రమంగా ఆక్రమించిన భూములను తిరిగి స్వాధీనం
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ..
ఆరవ షెడ్యూల్‌లో చేర్చబడిన ప్రాంతాలు, అలాగే షెడ్యూల్డ్ తెగలు నివసించే ప్రాంతాలు దీని నుంచి మినహాయిస్తామని స్పష్టం చేశారు. లవ్ జిహాద్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని.. అస్సాంను వరద రహిత రాష్ట్రంగా మార్చేందుకు కూడా ప్రయత్నాలు చేస్తామని తెలిపారు. జిల్లాకు ఒక వైద్య కళాశాల, ఒక విశ్వవిద్యాలయం, ఒక ఇంజనీరింగ్ కళాశాల తీసుకురావడమే తన లక్ష్యమన్నారు. రాబోయే ఐదేళ్లలో రెండు లక్షల ఉద్యోగాలు సృష్టిస్తానని చెప్పారు. అంతే కాకుండా రాష్ట్రంలో వరద సమస్యను పూర్తిగా నివారించేందుకు తొలి రెండు సంవత్సరాల్లో ₹18,000 కోట్ల ప్రాజెక్టులను అమలు చేస్తామని ప్రకటించారు. రాష్ట్రాన్ని 'వరద రహిత అస్సాం'గా మార్చడమే లక్ష్యమని సీఎం పేర్కొన్నారు.
అలానే నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత 60 ఏళ్లలో సాధించలేని అభివృద్ధిని బీజేపీ పదేళ్లలో సాధించిందని, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై కాంగ్రెస్‌కు స్పష్టమైన దృష్టి లేదని ఆరోపించారు. ఒకప్పుడు ఉద్యోగాల కోసం బయటకు వెళ్లిన అస్సాం యువత, ఇప్పుడు రాష్ట్రంలో పెరిగిన అవకాశాల కారణంగా తిరిగి వస్తున్నారని ఆమె అన్నారు.
-
BJP అధికారంలోకి వస్తే 'చేపల' నిషేధం! దీదీకి స్ట్రాంగ్ కౌంటర్ -
కేసీఆర్, హరీశ్ ను జైలులో పెట్టిన తర్వాతే - రేవంత్ సంచలనం..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
న్యాయం చేయలేకపోయా - కవిత ఆవేదన -
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
'అమరావతి' పై మారిన జగన్ నిర్ణయం, ఢిల్లీ మంత్రాంగం - పార్లమెంట్ సాక్షిగా..!! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!!












Click it and Unblock the Notifications