వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ విజన్ డాక్యుమెంట్: 'ప్రపంచ స్ధాయి సిటీగా ఢిల్లీ' (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఫిబ్రవరి 7న జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ విజన్ డాక్యుమెంట్ విడుదల చేసింది. ఢిల్లీలో నెలకొన్న పరిస్ధితులను ఎదుర్కొనే రీతిలో రోడ్ మ్యాప్ ప్రకటిస్తూ ఈ మేరకు విజన్ డాక్యుమెంట్ విడుదల చేసింది.

ఎన్నికల మేనిఫెస్టోకు బదులుగా విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేయనున్నట్లు బీజేపీ ముందుగానే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విజన్ డాక్యుమెంట్‌ని బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్ధి కిరణ్ బేడీ విడుదల చేశారు. మొత్తం 270 అంశాలతో ఈ విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్ ఉపాధ్యాయ్ మాట్లాడుతూ ఢిల్లీని ప్రపంచ స్థాయి సిటీగా తీర్చిదిద్దే దిశగా బీజేపీ పరిపాలన ఉంటుందని అన్నారు. ఢిల్లీ ప్రజలకు అవినీతి రహిత సుపరిపాలన తమ ధ్యేయమని కిరణ్‌ బేడీ చెప్పారు. తాగునీటి సరఫరా, మౌలిక సదుపాయాలను మెరుగు పరుస్తామని ఆమె వాగ్ధానం చేశారు. మురికివాడలో నివసించే పేదవారికి పక్కా ఇళ్లు, మహిళలపై ప్రత్యేక శ్రద్ధ తదితర హామీలు ఇచ్చారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అనంతకుమార్‌ మాట్లాడుతూ పార్టీ అజెండా స్థానంలో విజన్‌ డాక్యుమెంట్‌ను ప్రవేశపెట్టామని అన్నారు. దాని అమలు తీరును కిరణ్‌ బేడీ మీ ముందు ఉంచారని ఆయన తెలిపారు.

ప్రధాని మోడీ సుపరిపాలనకు రెండు సూత్రాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్ధి కిరణ్ బేడీతోపాటు, కేంద్ర మంత్రులు అనంత్ కుమార్, హర్షవర్ధన్ తదితర నేతలు పాల్గొన్నారు.

విజన్ డాక్యుమెంట్‌లో ముఖ్యాంశాలు:

ఢిల్లీలో బీజేపీ విజన్ డాక్యుమెంట్ విడుదల

ఢిల్లీలో బీజేపీ విజన్ డాక్యుమెంట్ విడుదల

ఫిబ్రవరి 7న జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ విజన్ డాక్యుమెంట్ విడుదల చేసింది. ఢిల్లీలో నెలకొన్న పరిస్ధితులను ఎదుర్కొనే రీతిలో రోడ్ మ్యాప్ ప్రకటిస్తూ ఈ మేరకు విజన్ డాక్యుమెంట్ విడుదల చేసింది.

 ఢిల్లీలో బీజేపీ విజన్ డాక్యుమెంట్ విడుదల

ఢిల్లీలో బీజేపీ విజన్ డాక్యుమెంట్ విడుదల

ఢిల్లీ ప్రజలకు అవినీతి రహిత సుపరిపాలన తమ ధ్యేయమని కిరణ్‌ బేడీ చెప్పారు. తాగునీటి సరఫరా, మౌలిక సదుపాయాలను మెరుగు పరుస్తామని ఆమె వాగ్ధానం చేశారు. మురికివాడలో నివసించే పేదవారికి పక్కా ఇళ్లు, మహిళలపై ప్రత్యేక శ్రద్ధ తదితర హామీలు ఇచ్చారు.

 ఢిల్లీలో బీజేపీ విజన్ డాక్యుమెంట్ విడుదల

ఢిల్లీలో బీజేపీ విజన్ డాక్యుమెంట్ విడుదల

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్ ఉపాధ్యాయ్ మాట్లాడుతూ ఢిల్లీని ప్రపంచ స్థాయి సిటీగా తీర్చిదిద్దే దిశగా బీజేపీ పరిపాలన ఉంటుందని అన్నారు.

 ఢిల్లీలో బీజేపీ విజన్ డాక్యుమెంట్ విడుదల

ఢిల్లీలో బీజేపీ విజన్ డాక్యుమెంట్ విడుదల

ఢిల్లీ ప్రజలకు అవినీతి రహిత సుపరిపాలన తమ ధ్యేయమని కిరణ్‌ బేడీ చెప్పారు. తాగునీటి సరఫరా, మౌలిక సదుపాయాలను మెరుగు పరుస్తామని ఆమె వాగ్ధానం చేశారు. మురికివాడలో నివసించే పేదవారికి పక్కా ఇళ్లు, మహిళలపై ప్రత్యేక శ్రద్ధ తదితర హామీలు ఇచ్చారు.

* ఢిల్లీని ప్రపంచ స్ధాయి నగరంగా అభివృద్ధి చేయడం

* ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ విభాగాల్లో అవినీతిని పారద్రోలడం

* బీజేపీ ఢిల్లీ ప్రజల కలలను సాకారం చేస్తుంది

* మహిళల భద్రత పెంపు

* యువతకు ఉపాధి

* పర్యావరణం, విద్యుతు త్రాగునీరు తదితర సమస్యలపై పరిష్కారానికి కృషి

* నిపుణుల సలహా మండలి

* శాసనసభ్యులు కోసం కొలమానాలు

* డిజిటల్ ఇండియా - ఆన్‌లైన్, మొబైల్ టెక్నాలజీని ఉపయోగించడం

* ప్రాజెక్టుల్లో ప్రభుత్వ జోక్యం

* 24 గంటలు విద్యుత్ సరఫరా

* నీటి సౌకర్యం

* రోడ్ల అభివృద్ధి

* ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు ఏర్పాటు

* ప్రతి నెలా రేడియో ప్రసంగం "మన్ కీ బాత్"

* ప్రధాని ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం

* ఈ విజన్ డాక్యుమెంట్ ముఖ్య ఉద్దేశం ఢిల్లీని ప్రపంచ స్ధాయి సిటీగా తీర్చిదిద్దడం

* ఢిల్లీని క్లీన్ అండ్ గ్రీన్‌గా ఉంచేందుకు హామీ

* కల్చరల్ హేరిటేజ్‌ని సంరక్షించడంతో పాటు ప్రదర్శించడం

ఫిబ్రవరి 7న హస్తినలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది.

English summary
The Bharatiya Janata Party has just released its Vision Document for Delhi ahead of the Delhi Assembly Elections 2015
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X