ఈ రాజ్యసభ అభ్యర్థిపై 28 క్రిమినల్ కేసులు!
పాట్నా: బీహార్ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా వున్న గోపాల్ నారాయణ్ సింగ్‌పై 28 క్రిమినల్ కేసులు ఉండటం సంచలనంగా మారింది. బిజెపి సీనియర్ నేత సుశీల్ మోడీని పక్కకు నెట్టి గోపాల్ నారాయణ్ బిజెపి తరఫున రాజ్యసభ అభ్యర్థిత్వానికి పంపడం చర్చనీయాంశంగా మారింది.
కాగా, గోపాల్ నారాయణ్‌పై క్రిమినల్ కేసులు ఉండటంతో బీహార్‌లోని అధికార జేడీయూ విమర్శలు చేస్తోంది. ప్రధాని మోడీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ఆయనను రాజ్యసభకు ఎంపిక చేయడాన్ని ప్రశ్నిస్తోంది. క్రిమినల్ కేసులే కాకుండా గోపాల్ నారాయణ్ ఎనిమిది సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం గమానర్హం.

గోపాల్ నారాయణ్ కేవలం 1977 ఎన్నికల్లో ఒకే ఒక్కసారి గెలుపొందారు. ఆర్ఎస్ఎస్‌తో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, తాను సంఘ్ కార్యకర్తనని నారాయన్ వెల్లడించారు. తాను చేసిన సేవలను గుర్తించి పార్టీ తనకు రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం ఇచ్చిందని నామినేషన్ వేసిన అనంతరం గోపాల్ నారాయణ్ తెలిపారు.
తనపై పెట్టినవన్నీ రాజకీయ కక్షపూరితమైన కేసులేనని నారాయణ్ సింగ్ చెబుతున్నారు. అయినా బిజెపి అతడిని ఎంచుకోవడం రాష్ట్రంలో రాజకీయంగా వివాదాస్పదమైంది. పలువురి నుంచి విమర్శలు వస్తున్నాయి. గోపాల్ నారాయణ్ జేడీయూపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.












Click it and Unblock the Notifications