బీజేపీ-ఆరెస్సెస్ కౌరవులు, బీజేపీ చీఫ్ హత్య కేసు నిందితుడు: రాహుల్ గాంధీ
Recommended Video

న్యూఢిల్లీ: బీజేపీ, రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ కౌరవుల్లా అధికారం కోసం అర్రులు చాస్తున్నాయని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఆదివారం అన్నారు. బీజేపీతి ఓ సంస్థ గొంతు అయితే కాంగ్రెస్ పార్టీది దేశం గొంతు అన్నారు.
ఆయన కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో ముగింపు సందర్భంగా మాట్లాడారు. బీజేపీ, ఆరెస్సెస్‌లో ఆధునిక యుగంలో కౌరవులు అన్నారు. తాము పాండవుల్లా సత్యం కోసం పోరాడుతున్నామన్నారు. బీజేపీ అసహనాన్ని పెంచి పోషిస్తోందన్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ బీజేపీ, ఆరెస్సెస్‌ల వలె ప్రవర్తించలేదన్నారు.
కాంగ్రెస్ నిజాయితీ కోసం పని చేస్తోందన్నారు. ఓ హంతకుడు బీజేపీకి అధ్యక్షుడిగా ఉన్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీపై ఆశలు పెట్టుకుందన్నారు. బీజేపీ, ఆరెస్సెస్‌లు అధికారం కోసం పాకులాడుతున్నాయన్నారు.
బీజేపీ అధ్యక్షులు ఓ హత్య కేసులో నిందితుడు అన్నారు. కాంగ్రెస్ అనేది వాస్తవమని, అది అభివృద్ధి కోసం పోరాడుతోందన్నారు. మోడీ అనేది ఓ మాయ అన్నారు. పూర్వం పాండవులు, కౌరవుల మధ్య యుద్ధం జరిగితే ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ మధ్య జరుగుతోందని అభిప్రాయపడ్డారు.
గాంధీజీ యాభై ఏళ్ల పాటు పోరాడి స్వాతంత్ర్యం తీసుకు వస్తే, వీర సావర్కర్ బ్రిటిష్ వారిని అర్థిస్తూ లేఖ రాశారని మండిపడ్డారు. ప్రభుత్వం అంచనాలకు అనుగుణంగా పని చేయడం లేదన్నారు. దేశంలో అభివృద్ధి ఎక్కడ ఉందన్నారు.
ఇప్పుడు ఏ వస్తువు చూసినా మేడిన్ చైనా అని కనిపిస్తోందన్నారు. రూ.33వేల కోట్లు దోచుకున్న వారిని మోడీ ప్రభుత్వం కాపాడుతోందన్నారు. మనది వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని, కానీ ఎక్కడకు వెళ్లి ఏ యువకుడిని ఏం చేస్తున్నావని అడిగినా ఏం చేయడం లేదంటాడని అన్నారు.












Click it and Unblock the Notifications