వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా వంకతో నచ్చని సిలబస్ కోత - సీబీఎస్ఈ బాటలో బీజేపీ పాలిత రాష్ట్రాలు

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో విద్యాసంస్ధలు మూతపడ్డాయి. విద్యార్ధులు ఇళ్లకే పరిమితమవుతున్నారు. త్వరలో విద్యాసంస్ధలను పునఃప్రారంభించేందుకు ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి. అదే సమయంలో విద్యార్ధులపై ఒత్తిడి తగ్గించేందుకు సీబీఎస్ఈతో పాటు పలు బోర్డులు కసరత్తు చేస్తున్నాయి. సిలబస్ లో తప్పనిసరి కాని పాఠ్యాంశాలను గుర్తించి తొలగిస్తున్నాయి. ఇప్పటికే సీబీఎస్ఈ సిలబస్ లో లౌకిక వాదం, నోట్ల రద్దు, జాతీయ వాదం వంటి కీలక అంశాలను తొలగించడంపై ఓవైపు వ్యతిరేకత వస్తున్నా.. ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా అదే బాట పట్టాయి.

సీబీఎస్ఈ సిలబస్ కోతలు..

సీబీఎస్ఈ సిలబస్ కోతలు..


ఇన్నాళ్లూ ప్రభుత్వాలకు, రాజకీయాలకు సంబంధం లేకుండా విద్యార్ధులు నేర్చుకున్న పలు పాఠ్యాంశాలను కరోనా సిలబస్ కోతల పేరుతో తొలగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విఫల నిర్ణయం నోట్లరద్దుతో పాటు లౌకిక వాదం, పౌరసత్వం, జాతీయ వాదం, సమాఖ్య వ్యవస్ద వంటి పలు కీలక పాఠ్యాంశాలను తొలగిస్తూ సీబీఎస్ఈ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దీనిపై పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అయినా ఏ మాత్రం లెక్క చేసే పరిస్ధితి లేదు. దేశంలో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి సిలబస్ లో ఉన్న పాఠ్యాంశాలను తొలగించడంపై ఓ పక్క నిరసనలు వ్యక్తమవుతుంటే ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా అదే బాట పట్టాయి.

సీబీఎస్ఈ బాటలో బీజేపీ రాష్ట్రాలు..

సీబీఎస్ఈ బాటలో బీజేపీ రాష్ట్రాలు..

కేంద్ర ప్రభుత్వానికి నచ్చని పాఠ్యాంశాలను కరోనా సిలబస్ కోతల పేరుతో సీబీఎస్ఈ తొలగిస్తే.. ఇప్పుడు బీజేపీ పాలిత కర్నాటక రాష్ట్రం తమకు నచ్చని టిప్పు సుల్తాన్ పాఠాలను తొలగించాలని నిర్ణయించింది. టిప్పు సుల్తాన్ తో పాటు మైసూర్ పాలకులైన హైదర్ అలీ, మొఘల్, రాజ్ పుత్, జీసస్, మహమ్మద్ ప్రవక్తకు సంబంధించిన పాఠ్యాంశాలను కర్నాటక ప్రభుత్వం తమ సిలబస్ నుంచి తప్పించింది. దీంతో అక్కడి విపక్ష కాంగ్రెస్ పార్టీ దీనిపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది. స్వాతంత్ర పోరాటానికి సంబంధించిన పాఠ్యాంశాలను ఉద్దేశపూర్వకంగా తొలగించడం సరికాదని మండి పడుతోంది.

Recommended Video

India V China: భారత్ టార్గెట్ గా పావులుకదుపుతోన్నChina,Pak,Nepal,Afghanistan మంత్రులకు దిశానిర్దేశం!
 తాత్కాలికమే అనే వాదన..

తాత్కాలికమే అనే వాదన..

కేంద్రం స్ధాయిలో సీబీఎస్ఈ సిలబస్ నుంచి కీలకమైన అంశాల తొలగింపు, రాష్ట్రాల స్ధాయిలో స్వాతంత్ర పోరాటానికి సంబంధించిన పాఠ్యాంశాల తొలగింపుపై వివాదాలు ముసురుకుంటున్నా.. అధికారులు మాత్రం ఇదంతా తాత్కాలికమే అంటున్నారు. ఇప్పటికే తాము తొలగించిన పాఠ్యాంశాలు ప్రత్యామ్నాయ అకడమిక్ క్యాలెండర్ ద్వారా కవర్ చేస్తామని సీబీఎస్ఈ చెబుతుండగా.. కర్నాటక సర్కారు కూడా ఇదే వాదన తెరపైకి తెస్తోంది. అయితే విపక్షాలు మాత్రం కాషాయీకరణలో భాగంగానే తమకు నచ్చని పాఠ్యాంశాలు తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నాయి. దేశంలో మిగతా బీజేపీ ప్రభుత్వాలు కూడా ఇదే బాటలో ఉండటంతో జాతీయ స్ధాయిలో దీనిపై పోరాటానికి కాంగ్రెస్ పార్టీ కూడా రంగం సిద్ధం చేస్తోంది.

English summary
on the foot steps of cbse, bjp ruling states also decided to cut down controversial topics in school syllabus. state govts doing this by the name of syllabus cuts in pandemic times.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X