కమల్ నాథ్ అడ్డాలో వికసించిన కమలం, ఇది ట్రైలర్ మాత్రమే, ఇంకా సినిమా ఉంది !
భోపాల్/మధ్యప్రదేశ్: కర్ణాటకలో అధికారాన్ని చేతులారా వదులుకున్న బీజేపీ ఇప్పుడు అలర్ట్ అయ్యింది. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నట్లు అనే సామెతలాగా కర్ణాటకలో ఊహించని ఎదురుదెబ్బతిన్న బీజేపీ నాయకులు ఇప్పుడు మేలుకుంటున్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మీద విజయం సాధించిన బీజేపీ ఇప్పుడు కాస్త ఊపిరిపీల్చుకుంది.
మధ్యప్రదేశ్ లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీ మీద ఓ మొట్టు ఎక్కువగానే ఓట్లు. సీట్లు సంపాధించింది చింద్వార నియోజక వర్గంలో జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మీద ఆదిపత్యం చూపించిన బీజేపీ నాయకులు ఇప్పుడు కాలర్ ఎగరేస్తున్నారు. 13 కార్పోరేటర్ల ఉప ఎన్నికల్లో బీజేపీ ఏడు స్థానాల్లో విజయం సాధించగా కాంగ్రెస్ పార్టీ ఆరు స్థానాల్లో విజయం సాధించింది.

కేవలం కార్పోరేట్ ఎన్నికలే కదా అనుకుంటే అక్కడ పప్పులో కాలు వేసినట్లు అవుతుంది. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిన కమల్ నాథ్ సొంత నియోజక వర్గం అయిన చింద్వారాలో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు కంగుతిన్నారు. అయితే ఉప ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ నాయకులు మాత్రం మంచి జోష్ మీద ఉన్నారు.
ఇదే ఏడాది చివరిలో మధ్యప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో మాజీ సీఎం, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కమల్ నాథ్ అడ్డాలో బీజేపీ విజయం సాధించడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు అయోమయంలో పడిపోయారు. కార్పోరేటర్స్ ఉప ఎన్నికల్లో మాజీ సీఎం కమల్ నాథ్, ఆయన కుమారుడు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ నకుల్ నాథ్ ఇద్దరూ 13 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున చాలా రోజుల పాటు ఎన్నికల ప్రచారం చేశారు.
సొంత అడ్డాలో తండ్రీకొడుకులు ఇద్దరూ ఎన్నికల ప్రచారం చేసినా మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో కమల్ నాథ్ కు ఎదురుదెబ్బ తగిలిందని స్థానిక మీడియా అంటోంది. ఇది ట్రైలర్ మాత్రమే అని, అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ లో కచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు శర్మా అంటున్నారు. ఈనెల 13వ తేదీన ఉప ఎన్నికలు జరగగా శుక్రవారం ఎన్నికల ఫలితాలను ఎన్నికల కమీషన్ ప్రకటించింది.












Click it and Unblock the Notifications