గవర్నర్‌తో విశ్వజిత్ రాణే భేటీ: సీఎం రేసులో ఉన్నారా..? తెలియదంటోన్న బీజేపీ
గోవాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తిరిగి బీజేపీ లీడ్ సాధించింది. ఇండిపెండెంట్ సాయంతో ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. అయితే సిట్టింగ్ సీఎం ప్రమోద్ సావంత్‌కు తిరగి పదవీ బాధ్యతలు అప్పగిస్తారా లేదా అనే అంశంపై క్లారిటీ లేదు. కానీ సీఎం రేసులో విశ్వజిత్ రాణే ముందు వరసలో ఉన్నారు. అయితే ఆయన గవర్నర్‌ను కలువడం ప్రాధాన్యం సంతరించుకుంది.

గవర్నర్‌ను వ్యక్తిగతంగా కలిశానని రాణే తెలిపారు. తాను క్రమశిక్షణ, నిబద్దత కలిగిన సైనికుడు అని చెప్పారు. సమావేశం గురించి తమకు తెలియదని బీజేపీ వర్గాలు అంటున్నాయి. తిరిగి సావంత్ సీఎంగా ఎన్నికవుతారా అని అడిగితే.. ఇదీ సున్నితమైన ప్రశ్న.. తెలియదు అని రాణే జారుకున్నారు. రాణే గవర్నర్‌తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయనకు ఏమైనా ఇండికేషన్స్ ఇచ్చారా అనే చర్చ జరుగుతుంది. కానీ అలాంటిదేం లేదని బీజేపీ అంటోంది.
అంతకుముందు గోవా కోసం మోడీ ఎంతో చేశారని రాణే పేర్కొన్నారు. ఇదీ ప్రజల విజయం అని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం బీజేపీ పనిచేసింది.. పనిచేస్తోందని వివరించారు. కాంగ్రెస్, ఇతర పార్టీలు అయితే ప్రజలను మోసం చేశాయని తెలిపారు. పోలింగ్ కేంద్రం నుంచి వెళుతూ మీడియాతో మాట్లాడుతుండగా.. అతనిని సీఎం చేయాలని మద్దతుదారులు నినాదాలు చేశారు. ఇదీ ప్రాధాన్యం సంతరించుకుంది. అనుకున్నట్టే గవర్నర్‌ను కలిశారు. మహిళా సాధికారత కోసం తమ ప్రభుత్వం పనిచేసిందని రాణే వివరించారు. రహదారుల నిర్మాణం, మౌలిక వసతుల సదుపాయాల కల్పన చేపట్టిందని తెలిపారు.












Click it and Unblock the Notifications