కర్ణాటక ఫలితాలు: జేడీఎస్ కుమారస్వామితో బీజేపీ మంతనాలు; కాంగ్రెస్ క్యాంపులకు హెలికాఫ్టర్లు రెడీ!!
కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల కోసం కౌంటింగ్ కొనసాగుతుంది. అధికార బీజేపీకి ఎదురుగాలి తగులుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. కర్ణాటక రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న బిజెపి రెండంకెల స్థానాలు కూడా దాటే పరిస్థితి కనిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీతో దూకుడుగా ముందుకు వెళుతుంది.
ఇక ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని పట్టుదలతో ఉన్న బిజెపి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మొదట జెడిఎస్ పేలవమైన ప్రదర్శన కనబరిచినప్పటికీ, కొద్దికొద్దిగా అనేక నియోజకవర్గాలలో పుంజుకుంటుంది. హోరాహోరీగా పోరాటాన్ని కొనసాగిస్తుంది. దీంతో బిజెపి ప్లాన్ బీ కి శ్రీకారం చుట్టింది. తమకు మెజార్టీ రాణి పక్షంలో ఆపరేషన్ ఆకర్షకు శ్రీకారం చుట్టింది.

ప్లాన్ బి లో భాగంగా బిజెపి అగ్రనేతలు కొందరు బెంగళూరు లోని ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో భేటీ అయ్యారు. అక్కడి నుండే జె డి ఎస్ అధ్యక్షుడు మాజీ సీఎం కుమారస్వామి తో మంతనాలు జరుపుతున్నారు. జెడిఎస్ క్రమంగా పుంజుకుంటున్న క్రమంలో ఇప్పుడు బీజేపీ దృష్టి జెడిఎస్ పై పడింది.

కర్ణాటకలో జెడిఎస్ ఇరవై సీట్ల లోపు స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది. కౌంటింగ్ సరళిని బట్టి అంచనా వేస్తున్న బిజెపి నాయకులు జేడీఎస్ నుండి గెలుపొందే నాయకులను తమ వైపు తిప్పుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కుమారస్వామి బీజేపీకి ఇంకా ఏ విషయం చెప్పటం లేదని సమాచారం.












Click it and Unblock the Notifications