వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంతో చేశాం.. చేసింది చెప్పుకొంటాం: ఎన్నికల షెడ్యూల్‌పై యోగి ఫస్ట్ రియాక్షన్

|
Google Oneindia TeluguNews

లక్నో: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మొత్తం ఏడు విడతల్లో ఈ ఎన్నికల పోలింగ్ ముగియనుంది. మార్చి 10వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. అధికారంలో వచ్చేదెవరో.. ప్రతిపక్ష స్థానానికి పరిమితం అయ్యేదెవరో ఆ రోజున తేలిపోతుంది. తొలి విడత పోలింగ్ ఫిబ్రవరి 10వ తేదీన మొదలవుతుంది. ఏడు విడతల్లో కొనసాగుతుంది. మార్చి 7వ తేదీన చివరి దశ పోలింగ్‌ను షెడ్యూల్ చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం. 10వ తేదీన కౌంటింగ్‌ను చేపడుతుంది.

కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో..

కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో..

దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సుశీల్ చంద్ర ఈ మధ్యాహ్నం విడుదల చేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మరుక్షణం నుంచే ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినట్లు తెలిపారు. దీనితో ఎన్నికలు ఎదుర్కొనబోతోన్న ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్‌లల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను అధికారులు అమలు చేశారు. బ్యానర్లు, ఫ్లెక్సీలను తొలగించారు. ఉత్తర ప్రదేశ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హోర్డింగులను తొలగించారు.

యోగి ఫస్ట్ రియాక్షన్..

యోగి ఫస్ట్ రియాక్షన్..

కాగా- ఎన్నికల షెడ్యూల్ విడుదలపై యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనడానికి తాము సంసిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. వరుసగా రెండోసారి అధికారంలోకి వస్తామనడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలకు ఎలాంటి అవకాశాన్ని ఇవ్వబోమని తేల్చి చెప్పారు. కొత్త ప్రభుత్వాన్ని తామే ఏర్పాటు చేయబోతోన్నామని యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. ఈ అయిదేళ్లలో చేసిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని అన్నారు.

ఎంతో చేశాం.. చేసింది చెప్పుకొంటాం..

ఎంతో చేశాం.. చేసింది చెప్పుకొంటాం..

తమ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే శక్తి, సామర్థ్యాలు ప్రతిపక్షాలకు లేదని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. 350 స్థానాలను తాము గెలవబోతోన్నామని పునరుద్ఘాటించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం.. ఉత్తర ప్రదేశ్‌కు ఎంతో చేసిందని గుర్తు చేశారు. వాటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తామని, ప్రజలే తమను గెలిపించుకుంటారని అన్నారు. అధికారంలోకి వస్తే.. తాము ఏం చేయాలో చెప్పుకొనే పరిస్థితి కూడా ప్రతిపక్షాలకు లేదని యోగి చెప్పారు.

మళ్లీ అధికారం మాకే..

మళ్లీ అధికారం మాకే..

తాము అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను మరింత ముందుకు తీసుకెళ్లడానికి ప్రజలు మళ్లీ తమకే అధికారాన్ని అప్పగిస్తారనే విశ్వాసం తనకు ఉందని యోగి ఆదిత్యనాథ్ తేల్చి చెప్పారు. అయిదేళ్లల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మార్గదర్శకంలో, ఆయన నాయకత్వంలో ఉత్తర ప్రదేశ్ సరికొత్తగా ఆవిర్భవించిందని అన్నారు. ప్రజలు కోరుకున్న మార్పును తాము కార్యరూపంలోకి తీసుకొచ్చామని చెప్పారు. శాంతిభద్రతలను పరిరక్షించామని అన్నారు.

బీజేపీ ప్రభంజనం..

బీజేపీ ప్రభంజనం..


ఎన్నికల షెడ్యూల్‌ను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని చెప్పారు. మార్చి 10వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపు సందర్భంగా ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ అత్యద్భుత మెజారిటీని సాధించి, అధికారంలోకి వస్తుందని, వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనడంలో ఎలాంటి అనుమానాలు లేవని అన్నారు. కోవిడ్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని పోలింగ్ సందర్భంగా ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటామని యోగి చెప్పారు.

English summary
Uttar Pradesh Chief Minister Yogi Adityanath said that BJP will be successful in forming in the government again in the State.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X