కేజ్రీవాల్ ను ముంచిన బీజేపీ - కీలక మలుపు..!!
ఢిల్లీ అసెంబ్లీ సమరం హోరా హోరీగా మారుతోంది. త్రిముఖ పోరులో మూడు పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా తల పడుతున్నాయి. ప్రచారం పతాక స్థాయికి చేరింది. ఆప్ - బీజేపీకి గెలుపు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. దీంతో, ఏ అవకాశాన్ని వదులుకోకుండా పార్టీలు ప్రచారం కొనసాగి స్తున్నాయి. యూపీ సీఎం యోగి ప్రచారం తో ఎన్నికల పోరు కొత్త టర్న్ తీసుకుంది. ఇప్పుడు బీజేపీ అభ్యర్ధులు కేజ్రీవాల్ టార్గెట్ గా ముందుకెళ్తున్నారు. బీజేపీ నేత పర్వేష్ శర్మ తాజాగా యమునా నదిలో కేజ్రీవాల్ కటౌట్ ముంచటం వివాదంగా మారుతోంది.
త్రిముఖ పోటీలో
ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ - ఆప్ మధ్య ప్రధాన పోటీ కనిపిస్తోంది. ఎలాగైనా అధికారం నిలబెట్టుకోవాలి అనే లక్ష్యంతో కేజ్రీవాల్ అడుగులు వేస్తున్నారు. హర్యానా, మహారాష్ట్ర తరువాత ఇప్పుడు ఢిల్లీలో తమదే విజయమని బీజేపీ ధీమాగా కనిపిస్తోంది. యూపీ సీఎం యోగీ ఢిల్లీలో ప్రచారంలో కాలుష్యం గురించి ప్రధానంగా ప్రస్తావించారు. కేజ్రీవాల్ యమునా నదిలో స్నానం చేయగలరా అంటూ ప్రశ్నించారు. కాగా, యోగీ విమర్శలను కేజ్రీవాల్ తిప్పి కొట్టారు. కాగా.. ఇప్పుడు ఈ కాలుష్యం వివాదం ఎన్నికల ప్రచారంలో ప్రధాన అస్త్రంగా మారింది. యమునా నదీ కాలుష్యం పైన బీజేపీ అభ్యర్ధి పర్వేష్ వర్మ వినూత్న నిరసనకు దిగారు. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కేజ్రీ వాల్‌పై పర్వేష్ వర్ పోటీ చేస్తున్నారు.

బీజేపీ వినూత్న నిరసన
ప్రచారంలో భాగంగా ఆయన యమునా నది వద్దకు కేజ్రీవాల్ కటౌట్ తో చేరుకున్నారు. దాని పైన
'నేను విఫలమయ్యా. నాకు ఓటు వేయవద్దు. 2025 నాటికి యమునా నదిని శుభ్రం చేయడంలో నేను విఫలమయ్యా' అంటూ రాసుకొచ్చారు. ఆ కటౌట్‌ను యమునా నదిలో పలుమార్లు ముంచారు. కలుషిత యమునా నదిని శుభ్రం చేస్తామని ఇచ్చిన హామీని ఆప్ నెరవేర్చలేదని విమర్శించారు. యమునా నీటిని తాము పూర్తిగా శుభ్రం చేయగలమని.. శుభ్రం చేయడం రాకెట్ సైన్స్ కాదని చెప్పుకొచ్చారు. యంత్రాల ద్వారా బురదను తొలగించాలని సూచించారు. మురుగునీరు, నీటి శుద్ధి ప్లాంట్లను నిర్మించాలని డిమాండ్ చేసారు.
#WATCH | BJP candidate from the New Delhi assembly constituency, Parvesh Verma reaches Yamuna Ghat; takes a jibe at AAP National Convenor Arvind Kejriwal over the issue of cleaning Yamuna River. pic.twitter.com/uAVHPwOpDx
— ANI (@ANI) January 25, 2025
ఆప్ ఆగ్రహం
ప్రధాని మోదీ సబర్మతి నదీ తీరాన్ని నిర్మించినట్లే, యమునా నదీ తీరాన్ని కూడా అదే విధంగా నిర్మించవచ్చని పర్వేష్ చెప్పుకొచ్చారు. కేజ్రీవాల్ భారీ కటౌట్‌ను పర్వేష్ వర్మ యమునా నదిలో ముంచిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీని పైన ఆప్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నేతలు సహనం కోల్పోతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక, వచ్చే వారం ప్రధాని మోదీ సహా బీజేపీ అగ్ర నేతలు ఢిల్లీలో ప్రచారంలోకి దిగుతున్నారు. ఫిబ్రవరి 3వ తేదీతో ఢిల్లీలో ప్రచారం ముగియనుంది. 5వ తేదీ జరిగే పోలింగ్ పైన ప్రధాన పార్టీల్లో భారీ అంచనాలు కనిపిస్తున్నాయి.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications