రైతు ఉద్యమంలో కీలక మలుపు -యూపీ, బీహార్ సరిహద్దులో భారీ సభ -వక్తగా రాకేశ్ టికాయత్
వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీ శివారుల్లో వేలాది మంది రైతులు చేస్తోన్న నిరసనలు మంగళవారం నాటికి 103రోజులు పూర్తయ్యాయి. చట్టాలపై వెనక్కి తగ్గబోమని కేంద్రం భీష్మించడం, చర్చల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోవడంతో ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేసే దిశగా రైతు సంఘాలు కదులుతున్నాయి. ఈ క్రమంలో..
భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నాయకుడు రాకేశ్ టికాయత్ బుధవారం ఉత్తర ప్రదేశ్‌లోని సికందర్‌పూర్‌లో జరిగే రైతుల ర్యాలీలో పాల్గొననున్నారు. ఈ ఊరు ఉత్తరప్రదేశ్ - బీహార్ సరిహద్దు వద్ద ఉండటంతో ఉద్యమ విస్తరణకు అనువుగా ఉంటుందని నేతలు ఈమేరకు డిసైడయ్యారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై ఆందోళన చేస్తున్న అక్కడి రైతుల్లో చైతన్యం నింపేందుకు రాకేశ్ వస్తున్నట్టు రైతుల నేతలు వెల్లడించారు.

భారతీయ కిసాన్ సభ ఇంచార్జ్ అజిత్ రాయ్ మాట్లాడుతూ... బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో రైతు ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై పదునైన వ్యూహం రచిస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా..
బుధవారం రైతుల సంఘాలు నిర్వహించ తలపెట్టిన 'కిసాన్ మహాపంచాయత్'కు కాంగ్రెస్, వామపక్షాలతో పాటు పలు రైతుల సంఘాల మద్దతు ఉందన్నారు. కాగా 'కిసాన్ మహాపంచాయత్' నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్టు జిల్లా ఎస్పీ డాక్టర్ విపిన్ తాడా పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications