Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నోకియా ప్లాంట్ మూసివేత, వీధుల్లో పడిన ఉద్యోగులు

న్యూఢిల్లీ: తమిళనాడులోని శ్రీ పెరంబుదూరులో ఏర్పాటు చేసిన నోకియా కంపెనీని శాశ్వతంగా మూసివేశారు. ఈ యూనిట్ కార్యకలాపాలను శనివారం నుంచి నిలిపివేస్తున్నట్లు గతంలోనే ఈ సంస్ధ ప్రకటించిన విషయం తెలిసిందే.

చెన్నై - కాంచీపురం మధ్య ఉన్న శ్రీ పెరంబుదూరు వద్ద 220 ఎకరాల స్ధలంలో 'నోకియా' సంస్ధ మొబైల్ ఫోన్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పింది. జనవరి 2006 నుంచి ఈ యూనిట్‌లో మొబైల్ ఫోన్ల్ ఉత్పత్తి ఆరంభమైంది.

Black Friday for workers as Nokia shuts Chennai factory

ఇక్కడి నుంచి నోకియా ఇప్పటి వరకూ 96 కోట్ల మొబైల్ ఫోన్లను ఉత్పత్తి చేసింది. ఈ సంస్ధలో మూడు షిప్టుల్లో ఎనిమిది వేల మంది పనిచేసేవారు. ఇప్పడు వారంతా పనులు లేక వీధుల్లో పడాల్సిన పరిస్దితి వచ్చింది.

పరోక్షంగా పాతికవేల మంది ఉపాధి పొందేవారు. చివరి రోజు ఉద్యోగులు ఆ యూనిట్ నుంచి భారమైన హృదయాలతో బయటకు కదిలారు. పన్ను వివాదాలన్నీ ఆ సంస్ధ పరిష్కరించుకునే వరకూ నోకియా ప్లాంట్ సెంట్రలో బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ ఆధీనంలోకి వెళుతుంది. ఆ విభాగం తరుపున శ్రీ పెరంబుదూరు తహసీల్దార్ ఈ ప్లాంట్‌ను పరిరక్షిస్తారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+