వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కృష్ణ జింకల కేసు: సల్మాన్ ఖాన్‌కు బెయిల్ మంజూరు, రూ.50వేల పూచీకత్తు

|
Google Oneindia TeluguNews

Recommended Video

సల్మాన్‌ బెయిల్‌ పిటషన్‌పై విచారణ ,బెయిల్‌ మంజూరు

జోధ్‌పూర్‌: కృష్ణ జింకల కేసులో ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్‌ ఖాన్‌‌కు బెయిల్‌ మంజూరైంది. రూ. 50వేల పూచీకత్తుపై సల్మాన్ ఖాన్‌కు శనివారం జోధ్‌పూర్ కోర్టు బెయిల్ ఇచ్చింది. కోర్టు అనుమతి లేకుండా సల్మాన్ దేశం విడిచి వెళ్లడానికి వీల్లేదని న్యాయమూర్తి ఆదేశించారు. బెయిల్‌పై విచారణ సమయంలో సల్మాన్‌ సోదరీమణులు అల్విరా, అర్పిత కోర్టులో ఉన్నారు.

కాగా, సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి రవీంద్ర కుమార్‌ జోషి బదిలీ నేపథ్యంలో తొలుత విచారణపై అనిశ్చితి నెలకొంది. కానీ, ఆయన శనివారం ఉదయం విధులకు హాజరై సల్మాన్‌ బెయిల్‌ పిటషన్‌పై విచారణ జరిపారు.

Blackbuck poaching case: Salman Khan granted bail

తీర్పు మధ్యాహ్నం భోజన విరామం‌ తర్వాత వెల్లడించారు. సల్మాన్‌కు బెయిల్‌ ఇవ్వొద్దని ప్రాసిక్యూషన్‌ కోరింది. రెండు కృష్ణ జింకలను వేటాడి చంపిన కేసులో సల్మాన్‌ఖాన్‌కు గురువారం ఐదేళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. దీంతో రెండ్రోజులపాటు సల్మాన్ జైల్లోనే గడిపారు. కాగా, బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో సల్మాన్ శనివారం 6గంటల ప్రాంతంలో జైలు నుంచి విడుదలయయారు.

ప్రత్యేక విమానంలో ఇంటికి..

సల్మాన్‌ను తీసుకెళ్లేందుకు కొందరు సన్నిహితులు జోధ్‌పూర్ జైలుకు వచ్చారు. జైలునుంచి విడుదలైన సల్మాన్‌ను పోలీసులు జోధ్‌పూర్ ఎయిర్‌పోర్టుకు తరలించారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో సల్మాన్ ముంబైకి బయలుదేరారు. ఒకరిద్దరు వ్యక్తిగత సిబ్బంది, సన్నిహితులు సల్మాన్‌తో ఉన్నారు. మరోవైపు కృష్ణ జింకల వేట కేసులో సల్మాన్‌ కేసు తదుపరి విచారణ మే7న చేపట్టనున్నారు.

బెయిల్‌పై శుక్రవారమే విచారణ జరగాల్సి ఉండగా సల్మాన్‌కు బెయిల్‌ ఇవ్వాలా వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకోవడానికి కేసు పూర్తిగా పరిశీలించాల్సి ఉందని న్యాయమూర్తి జోషి శనివారానికి వాయిదా వేశారు. దీంతో గత రెండు రోజులుగా సల్మాన్‌ జైల్లోనే సాధారణ ఖైదీగా గడిపారు. కాగా, బిష్ణోయ్ వర్గం తాజా తీర్పుపై హైకోర్టులో సవాల్ చేస్తామని పేర్కొంది.

సల్మాన్ కృష్ణ జింకల కేసు 20ఏళ్ల క్రితంది కావడం గమనార్హం. 1998 అక్టోబరులో జోధ్‌పూర్‌ సమీపంలోని కంకణి గ్రామం భగోదాకీ ధనిలో రెండు కృష్ణ జింకలు హత్యకు గురైనట్లు కేసు నమోదైంది. 'హమ్‌ సాథ్‌ సాథ్‌ హై' సినిమా చిత్రీకరణ సందర్భంగా అక్కడకు వచ్చిన సల్మాన్‌ఖాన్‌, సహ నటులు సైఫ్‌ అలీఖాన్‌, టబు, సోనాలీ బింద్రే, నీలంలతో కలిసి వాహనంపై వెళ్తూ జింకల గుంపుపై కాల్పులు జరిపారనీ, దీంతో రెండు కృష్ణ జింకలు చనిపోయాయని అభియోగాలు నమోదయ్యాయి. ఇదే కేసులో సల్మాన్‌ 1998, 2006, 2007 సంవత్సరాల్లో మొత్తం 18 రోజులు జోధ్‌పూర్‌ జైల్లో గడిపారు.

English summary
A Jodhpur Court on Saturday (April 7) granted bail to Bollywood actor Salman Khan, who has been sentenced to five years in prison for killing two blackbucks in 1998, today (April 7). The bail has been granted on a surety of Rs 50,000. As per reports, the actor's fans have begun their celebrations as the superstart is set to walk free.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X