ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద పేలుడు: హైఅలర్ట్

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం సాయంత్రం ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. దీనిపై వెంటనే పోలీసులకు సమాచారం అందడంతో అప్రమత్తమయ్యారు. భారీ ఎత్తున పోలీసు బృందాలు హుటాహుటిన చాణక్యపురి ప్రాంతంలోని ఇజ్రాయెల్ ఎంబసీ వద్దకు వెళ్లి క్షుణ్ణంగా తనిఖీ చేపట్టారు.

ఆ ప్రాంతంలో అనుమానాస్పాద వస్తువులు ఏమీ కనిపించలేదని తనిఖీల అనంతరం పోలీసులు వెల్లడించారు. సాయంత్రం 5 గంటల సమయంలో ఎంబసీ కార్యాలయం వద్ద పెద్ద పేలుడు శబ్ధం వినిపించిందని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం అధికార ప్రతినిధి మీడియాకు తెలిపారు. అయితే, ఏం జరిగిందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదన్నారు.

Blast Near Israel Embassy in Delhi, Puts Police On High Alert

తమ భద్రతా సిబ్బంది దీనిపై దర్యాప్తు చేస్తున్నారని ఆయన తెలిపారు. అయితే, ఎంబసీ కార్యాలయం పరిసరాల్లో రాయబారిని ఉద్దేశించి రాసిన ఓ లేఖను గుర్తించినట్లు సమాచారం. మరోవైపు, ఈ వ్యవహారంపై ఇజ్రాయెల్ విదేశాంగా మంత్రిత్వ శాఖ స్పందించింది. తమ సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నారని.. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు స్థానిక అధికారులకు సహకరిస్తున్నామని తెలిపింది.

కాగా, ఇజ్రాయెల్.. ఉగ్రవాదులను తుద ముట్టించేందుకు దాడులు చేస్తున్న విషయం తెలిసిందే .ఇజ్రాయెల్ దాడుల్లో ఉగ్రవాదులతోపాటు పలువురు సామాన్య ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో పలు దేశాలు ఇజ్రాయెల్ పై తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+