ఒకే అంబులెన్స్‌లో 22 మృతదేహాలు -కరోనా విలయంలో మరో ఘోరం -వాహనాల్లేవు, ఏం చేయమంటారు?

దేశంలో కరోనా ఉధృతి పెరుగుతున్నకొద్దీ హృదయ విదారక దృశ్యాలెన్నో వెలుగులోకి వస్తున్నాయి. కొవిడ్ మృతులకు కనీస మర్యాదలతో అంత్యక్రియలు నిర్వహించాలన్న కోర్టుల ఆదేశాలు దాదాపు ఎక్కడా అమలు కావడంలేదు. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలోనైతే పరిస్థితి ఇంకాస్త దిగజారింది. అధికారుల నిర్లక్ష్యం, వ్యవస్థ వైఫల్యాన్ని కళ్లకు కట్టే ఘటన తాజాగా చోటుచేసుకుంది..

Recommended Video

    CoWin, Aarogya Setu and Umang app will be open for vaccine registrations | Oneindia Telugu

    కరోనాతో మరణించిన 22 మంది మృతదేహాలను ఒకే అంబులెన్స్‌లో తరలించడం విమర్శలకు దారి తీసింది. సరైన వైద్య పరమైన రవాణా సదుపాయాలు లేనందునే ఇలా చేయాల్సి వచ్చిందని జిల్లా అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లాలో కొవిడ్‌తో చనిపోయిన 22 మంది మృతదేహాలను ఒకే అంబులెన్సులో తరలించారు.

    Bodies of 22 COVID-19 victims stuffed in one ambulance in Maharashtra, public outrage

    బీడ్‌ జిల్లాలోని స్వామీ రామానంద్‌తీర్థ్‌ గ్రామీణ ప్రభుత్వ వైద్య కళాశాల మార్చురీలో ఉంచిన మృతదేహాలను దహన సంస్కారాల కోసం ఆదివారం ఇలా రవాణా చేశారు. ఆస్పత్రిలో అంబులెన్సులు తగినన్ని లేనందున కరోనా రోగులను తరలించే వాహనంలోనే 22 మృతదేహాలను ఒకేసారి శ్మశానాలకు తరలించారు. ఈ ఘటన తాలూకు దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా,

    Bodies of 22 COVID-19 victims stuffed in one ambulance in Maharashtra, public outrage

    ఒకే అంబులెన్స్ లో అన్నేసి మృతదేహాలను తరలించడంపై వైద్య కళాశాల డీన్ డాక్టర్ శివాజీ సుక్రే స్పందించారు. ఆస్పత్రిలో తగినన్ని అంబులెన్సులు లేనందునే ఇలా జరిగిందన్నారు. గత ఏడాది తొలి దశ కరోనా వ్యాప్తి సమయంలో తమ వద్ద ఐదు అంబులెన్సులు ఉండేవని.. అందులో మూడింటిని ఆస్పత్రి నుంచి ఉపసంహరించడంతో కొవిడ్‌ బాధితులను తరలిస్తున్నట్లు వివరించారు. మరో మూడు అంబులెన్సులను మంజూరు చేయాలని జిల్లా అధికారులకు మార్చి 17న లేఖ రాసినట్లు చెప్పారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+