సహజీవనం: ప్రేమజంటను చంపేసి వేర్వేరు చోట్ల పడేశారు
ట్యూటికోరిన్: తమిళనాడు రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సహజీవనం చేస్తున్న ఓ ఇద్దరు యువతీయువకులను హత్య చేసిన దుండగులు, వేర్వేరు ప్రాంతాల్లో పడేశారు. దీన్ని పరువు హత్యగా అనుమానిస్తున్నట్లు పోలీసులు సోమవారం తెలిపారు.
మృతురాలు సి అరుణ(32) శరీరం పాక్షికంగా కాలిపోయి ఉందని చెప్పారు. ఆమెను గొంతు నులిమి చంపినట్లు తెలుస్తోందని చెప్పారు. సి రాజ్‌నాగేష్(25) అనే యువకుడి మృతదేహం తీవ్రంగా కుళ్లిపోయిందని తెలిపారు. ఈ రెండు మృతదేహాలను జూన్ 3న ట్యూటికోరిన్‌కు సమీపంలోని అటవీ ప్రాంతంలో వేర్వేరుగా గుర్తించినట్లు చెప్పారు.

అరుణకు గత ఐదేళ్ల క్రితం ముత్తుస్వామి అనే వ్యక్తితో వివాహమైందని, అయితే ఆ తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకున్నారని పోలీసులు తెలిపారు. అనంతరం డ్రైవర్‌గా పని చేస్తున్న రాజ్‌నాగేష్‌తో అరుణ ప్రేమలో పడింది.
ఈ నేపథ్యంలో వారిద్దరూ గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. కాగా, ఇది ఆమె కుటుంబసభ్యులను ఇబ్బందులకు గురిచేసినట్లు తెలుస్తోంది. దీంతో వారే వీరిద్దరిని హత్య చేశారని అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications