దావుద్ ఇబ్రహీం, బాలీవుడ్ కు ఉన్న సంబంధం ఇదే, కపూర్ ఫ్యామిలీ టాప్ హీరో ఆత్మకథలో, హీరోయిన్లతో !
కొన్నేళ్ల క్రితం వరకు బాలీవుడ్ పూర్తిగా అండర్ వరల్డ్ చేతుల్లో ఉండడం కొత్త కాదు. 1990వ దశకానికి ముందు బాలీవుడ్ పూర్తిగా అండర్ వరల్డ్ కనుసన్నల్లో ఉండేది. సినిమా పార్టీల్లో అండర్ వరల్డ్ గ్యాంగ్ స్టర్లు బహిరంగంగా కనిపించేవారు. అప్పటి బాలీవుడ్ లోని కొందరు హీరోయిన్లతో మాఫియా డాన్ లకు శారీరక సంబంధాలు, సన్నిహిత సంబంధాలు ఉండేవని వెలుగు చూసింది.
తమ అభిమాన నటీమణులకు ఎక్కువ సినిమాల్లో నటించేలా అండర్ వరల్డ్ ముఠా సభ్యలు ప్లాన్ చేసేవారు. సినిమా నిర్మాతలను బెదిరించి సినిమా లాభాల్లో వాటా పొందేవారు. అయితే 90వ దశకం తర్వాత బాలీవుడ్‌పై మాఫియా నియంత్రణ పోయిందని చెబుతున్నప్పటికీ ఇది పూర్తిగా నిజం కాదు. ఇప్పుడు కూడా బాలీవుడ్ మాఫియా ముఠా చేతుల్లోనే ఉందనడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయని కొందరు అంటున్నారు.

నటులు, నటీమణుల రోజువారీ వ్యవహారాలే కాదు, నటులు, నటీమణుల పెళ్లిళ్ల విషయంలో కూడా ఈ మాఫియా ఢాన్ ల ప్రమేయంఉందనే ఆరోపణలు ఉన్నాయి. అదే కారణంతో బాలీవుడ్‌లో కొన్ని వింత వివాహాలు జరుగుతుంటాయి. సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వడం మామూలే అంటున్నారు. ఇదే విషయాన్ని కొన్ని నెలల క్రితం ప్రముఖ దర్శకుడు సంజయ్ గుప్తా కూడా వివరించారు.
90వ దశకంలో బాలీవుడ్ కూడా అండర్ వరల్డ్ చేతుల్లో చిక్కింది. అబూ సలేం, దావూద్ ఇబ్రహీం, ఛోటా షకీల్ వంటి అనేక మంది అండర్ వరల్డ్ నేరస్థులు బాలీవుడ్‌ను శాసించారు. సల్మాన్ ఖాన్, సంజయ్ దత్, అనిల్ కపూర్, రామ్ గోపాల్ వర్మ ఇంకా చాలా మంది స్టార్ నటులు, దర్శకులు అండర్ వరల్డ్ డాన్ లు చెప్పినట్లు చేశారని ఆరోపణలు ఉన్నాయి. అండర్ వరల్డ్ డాన్ లు బాలీవుడ్ సినిమాల్లో బ్లాక్ మనీ ఇన్వెస్ట్ చేశాడు.

అండర్ వరల్డ్ డాన్ లు చెప్పినట్లు హీరో హీరోయిన్లతో సినిమా తీయాల్సింది. నిర్మాతలు తమ మాట వినని ఉదాహరణలు కూడా ఉన్నాయని, అయితే అలాంటి నిర్మాతలను చంపేశారని దర్శకుడు సంజయ్ గుప్తా వివరించారు. అండర్ వరల్డ్ హీరో దావూద్ ఇబ్రహీం విష ప్రయోగంతో ఆస్పత్రిలో చేరిన నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ అండర్ వరల్డ్, బాలీవుడ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
దావూద్ ఇబ్రహీం గురించి మరోసారి వార్తలు గుప్పుమన్నాయి. ఒకప్పుడు బాలీవుడ్‌ను శాసించి 2020లో కన్నుమూసిన నటుడు రిషి కపూర్ ఏమన్నాడనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అలనాటి సూపర్ స్టార్ రిషి కపూర్ తన జీవిత చరిత్ర ఖుల్లాం ఖుల్లాలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. బాలీవుడ్‌లో తన ప్రయాణం గురించి, జీవితంలో తాను కలుసుకున్న చాలా మంది వింత వ్యక్తుల గురించి కూడా రిషి కపూర్ ప్రస్తావించారు.

ఏది ఏమైనప్పటికీ రిషి కపూర్ విషయాలు ఉన్నట్లే చెప్పే ముక్కుసూటి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. బయటికి మాట్లాడటానికి రిషి కపూర్ కు ఎలాంటి సంకోచం లేదు. ఈ ఆత్మకథలో దావూద్ ఇబ్రహీంతో తన భేటీ గురించి వివరించాడు.పుస్తకంలోని ఒక అధ్యాయంలో, అతను తన జీవితంలో రెండుసార్లు దావూద్ ఇబ్రహీంను కలిసినట్లు రిషి కపూర్ రాశారు. బాలీవుడ్, అండర్ వరల్డ్ మధ్య ప్రత్యక్ష సంబంధం ఉన్న సమయంలో ఈ భేటీ జరిగిందని రిషికపూర్ వివరించారు.
ఈ భేటీ ఎలా జరిగిందో, దావూద్ తన ముందు ఏం మాట్లాడాడో వివరిస్తూ రిషి కపూర్ ఆయన అనుభవాలను ఆ పుస్తకంలో పంచుకున్నారు. బాలీవుడ్‌కి పరోక్ష అండర్ వరల్డ్ లింక్ గురించి రిషి కపూర్ మాట్లాడారు. కొందరు స్నేహితులతో కలిసి తాను సంగీత కచేరీ కోసం నేను దుబాయ్‌లో ఉన్నప్పుడు ఒక అపరిచితుడు నాకు ఫోన్ చేశాడు. అందులో భాయ్ నీతో మాట్లాడాలనుకుంటున్నాడని, మీరు రావాలని చెప్పాడని, తర్వాత ఆ భాయ్ అని పిలిచే డాన్ దావూద్ ఇబ్రహీం నన్ను, నా స్నేహితులను టీకి ఆహ్వానించాడని రిషి కపూర్ వివరించారు.

1993 బాంబే బాంబు పేలుళ్లలకు ముందు నన్ను దుబాయ్ లో మాట్లాడాలని దావుద్ ఇబ్రహీం ఆహ్వానించాడని రిషి కపూర్ వివరించారు. ఆ సందర్భంలో భారత్ నుంచి మీకు ఎప్పటికీ న్యాయం జరగదని అన్నారని, ఆ మాట విని నేను ఆశ్చర్యపోయానని, కానీ అతని లింక్ గురించి నాకు చాలా తెలుసు కాబట్టి నేను నిశ్శబ్దంగా ఉన్నానని, నేను బయటకు వెళ్లే ముందు, మీకు ఏదైనా సహాయం కావాలన్నా, డబ్బు కావాలంటే నన్ను అడగండి, నన్ను అడగడానికి వెనుకాడకండి అని దావుద్ ఇబ్రహీం చెప్పాడని రిషి కపూర్ ఆయన రాసిన పుస్తకంలో వివరించారు.
కానీ నేను దావుద్ ఇబ్రహీం ఆఫర్లు కోరుకోలేదని, వాటిని నేను తిరస్కరించానని అలనాటి నటుడు రిషి కపూర్ వివరించారు. 1989లో దుబాయ్‌లోని లెబనీస్ స్టోర్‌లో నీతూ కపూర్‌తో కలిసి షాపింగ్ చేస్తున్నప్పుడు దావూద్ ఇబ్రహీం తనను కలిశాడని రిషి కపూర్ వివరించారు. అలాగే రాజ్ కపూర్ అంత్యక్రియలకు దావూద్ ఇబ్రహీం తన ప్రతినిధిని పంపినట్లు రిషి కపూర్ అంగీకరించాడు. చాలా సంవత్సరాల తర్వాత దావుద్ ఇబ్రహీంను తాను కలిసినందుకు చింతించానని బాలీవుడ్ అలనాటి నటుడు రిషి కపూర్ ఆయన ఆత్మకథలో రాశారు.
-
సొంత భర్త సినిమాకు దీపిక ఆబ్సెంట్.. ఏం జరుగుతోంది..? -
రణవీర్ సింగ్‌ను చెంపదెబ్బ కొట్టిన ప్రముఖ నటి! వీడియో -
‘ధురంధర్2’ చూశారా? ప్రేక్షకుల్లో సృష్టించిన విద్వేషపూరిత చీలిక అర్థమైందా? -
"ధురంధర్ 2 సినిమాను బ్యాన్ చేయాలి" -
ఐ లవ్డ్ ధురంధర్ 1.. బట్ - జక్కన్న సెన్సేషన్ రివ్యూ: అలాంటి హీరోలందరినీ చంపేసింది -
సొంత సినిమాను వదిలేసి పరాయి సినిమాకు భజనా? -
దురంధర్-2కు బిగ్ షాక్.. ఆన్లైన్లో ప్రత్యక్షమైన ప్రింట్! -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం












Click it and Unblock the Notifications