బాంబు పేలుళ్లు: ప్రమాదకర దేశాల్లో భారత్‌కు 3వ స్థానం
న్యూఢిల్లీ: ప్రపంచంలోని చాలా ప్రమాదకరమైన దేశాల జాబితాలో భారతదేశం మూడో స్థానంలో నిలిచింది. ఆశ్చర్యకరమైనప్పటికీ ఈ వార్త వాస్తవమే. అత్యంత ప్రమాదకర సంఘటనలు చోటు చేసుకున్న దేశాల జాబితాలో ఇరాక్, పాకిస్థాన్ దేశాలు తొలి రెండు స్థానాల్లో స్థానం సంపాదించుకున్నాయి. తర్వాతి స్థానంలో మనదేశం ఉండటం గమనార్హం. దీనంతటికి దేశంలో చోటు చేసుకున్న బాంబు పేలుళ్లే కారణం.
నేషనల్ బాంబ్ డేటా సెంటర్ (ఎన్‌బిడిసి) తాజా సమాచారం ప్రకారం.. యుద్ధాలతో తీవ్ర ఒడిదుడుకులకు లోనైన అఫ్ఘానిస్థాన్, సిరియాలను వెనక్కి నెట్టిన భారత్, ఆశ్చర్యకరంగా మూడో స్థానంలో నిలిచింది. ఒక్క 2013లోనే భారతదేశంలో 212 బాంబు పేలుళ్లు జరగగా.. అఫ్ఘానిస్థాన్‌లో 108 బాంబు పేలుళ్లు జరిగాయని నేషనల్ బాంబ్ డేటా సెంటర్ విడుదల చేసిన సమాచారంలో వెల్లడైంది.

బంగ్లాదేశ్‌లో 75 బాంబు పేలుళ్లు జరగగా.. సిరియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో అనేక మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. సిరియాలో మాత్రం 36 బాంబు పేలుళ్లు మాత్రమే చోటు చేసుకున్నాయి. మొత్తంగా చూసుకుంటే.. భారతదేశంలో 241 బాంబు పేలుళ్లు జరగాయి. వీటి ఫలితంగా 113 మంది మరణించగా.. 419 మంది గాయాలపాలయ్యారు.
2013లో జరిగిన 212 బాంబు పేలుళ్లలో 130 మంది మృత్యువాత పడగా, 466 మంది గాయాలపాలయ్యారు. టైమ్స్ నై విశ్లేషనాత్మక నివేదిక ప్రకారం రాష్ట్రాల వారీగా పరిశీలించినట్లయితే బాంబు పేలుళ్లు ఎక్కువగా గురైన ఈశాన్య రాష్ట్రాలతోపాటు (అస్సాం, మణిపూర్ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది) మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలైన బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ లలో 80శాతం ఐఈడి పేలుళ్లు జరిగాయి. 2012తో పోల్చితే 2013లో జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో 50శాతం బాంబు పేలుళ్లు పెరిగాయి.












Click it and Unblock the Notifications