వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్‌ కారుపై బాంబులు, ఇటుకలతో దాడి, ‘టీఎంసీ గూండాల పనే..’

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: అసెంబ్లీ ఎన్నికల వేళ పశ్చిమబెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ కాన్వాయ్‌పై దాడి జరిగింది. కూచ్ బెహర్ ప్రాంతంలో దుండగులు దాడికి తెగబడ్డారు. బాంబులు, ఇటుకలతో దాడి చేశారు. ఈ దాడిలో దిలీప్ ఘోష్ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం దారుణ స్థితిలో ఉందని దాడి అనంతరం దిలీప్ ఘోష్ అన్నారు. తృణమూల్ గూండాలు తమ వాహనాలతోపాటు కొంతమంది కార్యకర్తలపైనా దాడి చేశారని విమర్శించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా తెలిపారు.

Bombs, bricks hurled at Bengal BJP chief Dilip Ghoshs car in CoochBehar

కూచ్ బెహర్ ప్రాంతంలోని సీతల్కూచీలో ఎన్నికల ప్రచారం నిర్వహించి తిరిగి వస్తుండగా దుండగులు దాడి చేశారు. టీఎంసీ జెండాలతో వచ్చిన దుండగులు బాంబులతో దాడి చేశారని ఘోష్ తెలిపారు. అంతేగాక, ఇటుకలతో తన కారుపై దాడికి దిగారని చెప్పారు. దీంతో కారు అద్దాలు పగిలిపోయాయయని, తన భుజానికి గాయమైందని తెలిపారు.

తనపై దాడి జరిగిన సమయంలో స్థానిక పోలీసులు ఎక్కడా కనిపించలేదని దిలీప్ ఘోష్ తెలిపారు. కాగా, ఫిబ్రవరి నెలలో బెంగాల్ బీజేపీ అధ్యక్షుడి కాన్వాయ్ పై దాడి జరిగిన విషయం తెలిసిందే. కాగా,, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పైనా డిసెంబర్, 2020న సౌత్ 24 పరగణాల జిల్లాలో దాడి జరిగిన విషయం తెలిసిందే.

Recommended Video

Covid-19 : 40 ‘Vaccinated’ Doctors In UP Test Covid-19 Positive

కాగా, ఏప్రిల్ 10న పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో 4వ దశ ఎన్నికల్లో భాగంగా 44 స్థానాలకు పోలింగ్ జరుగనుంది. హుగ్లీ, హౌరా, సౌత్ 24 పరగణాల, కూచ్ బెహర్, అలిపురర్దౌర్ జిల్లాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. బెంగాల్ ఎన్నికలు 8 దశల్లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఎన్నికల జరుగుతున్న క్రమంలో పలు ప్రాంతాల్లో టీఎంసీ, బీజేపీ నేతలు, కార్యకర్తల ఘర్షణలు జరుగుతున్నాయి.

English summary
West Bengal BJP president Dilip Ghosh’s car was attacked in Cooch Behar on Wednesday. It has been alleged that Ghosh was allegedly attacked when he was leaving after attending an election event in the Sitalkuchi area.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X