గోడ కట్టేస్తారా?: పాక్‌, బంగ్లా సరిహద్దులు మూసేస్తామన్న రాజ్‌నాథ్‌

Subscribe to Oneindia Telugu

తేకన్‌పూర్‌: దేశ సరిహద్దులో కవ్వింపు చర్యలకు చెక్ పెట్టేందుకు హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌తో ఉన్న అంతర్జాతీయ సరిహద్దులను వీలైనంత త్వరగా మూసివేసేందుకు భారత్‌ చర్యలు చేపడుతోందని రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొనడం గమనార్హం.

ఉగ్రవాదాన్ని నియంత్రించేందుకు భారత్‌ తీసుకోబోయే అతిపెద్ద నిర్ణయం ఇదేనని ఆయన పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లోని తేకన్‌పూర్‌ సరిహద్దు భద్రతా దళాల(బీఎస్‌ఎఫ్‌) అకాడమీలో జరిగిన పాసింగ్‌అవుట్‌ పరేడ్‌లో ఆయన పాల్గొన్నారు.

Border with Pak to be sealed soon: Rajnath

ఈ సందర్భంగా ఆయనకు బీఎస్‌ఎఫ్‌ బలగాలు గౌరవవందనం సమర్పించాయి. రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పాక్‌ ఉగ్రవాదంతో భారత్‌ ఒక్కటే ఇబ్బందులు ఎదుర్కొవడం లేదని, ప్రపంచ దేశాలపైనా ఈ ప్రభావం ఉందని అన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The International Border with Pakistan will be sealed soon, Union Home Minister, Rajnath Singh said while speaking at the passing out parade of Border Security Force assistant commandants at the BSF Academy in Tekanpur, Madhya Pradesh on Saturday.
Please Wait while comments are loading...