ఆరు సంవత్సరాల బాలిక మీద అత్యాచారం చేసిన మైనర్
తిరుపతి: ఒకటవ తరగతి చదువుతున్న బాలిక మీద 9 తరగతి చదువుతున్న బాలుడు అత్యాచారం చేసిన సంఘటన చిత్తూరు జిల్లా పిచ్చాటూరు మండలంలోని పులకండ్రులో జరిగింది. బాలుడిని (14) పూత్తూరు సీఐ సాయినాథ్ అరెస్టుచేసి విచారిస్తున్నారు.
తమిళనాడులోని తిరువళ్లూరుకు చెందిన ఓ కుటుంబం ఇద్దరు పిల్లలతో కలిసి ఈ నెల మూడవ తేదిన పులుకండ్రం ఎస్సీ కాలనీలోని బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి హాజరైనారు. తరువాత మాడు రోజులు అక్కడే ఉన్నారు. ఈ నెల 6వ తేదిన సాయంత్రం పిల్లలు ఇద్దరు ఇంటి ముందు ఆడుకుంటున్నారు.
అదే ప్రాంతంలో 9వ తరగతి చదువుతున్న 14 సంవత్సరాల బాలుడు నివాసం ఉంటున్నాడు. రాత్రి అయినా పిల్లలు ఇద్దరు ఇంటికి రాకపోవడంతో పిల్లల పేర్లు పెట్టి గట్టిగా పిలవడం మొదలు పెట్టింది. బాలుడు ఎడుస్తు ఎదురు వచ్చాడు. తరువాత అక్క ఎక్కడ ఉంది అని అడిగింది.

అక్కను అన్న ఎత్తుకుని మిద్దె మీదకు తీసుకు వెళ్లాడని, నేను వెనుక వెలితే కోట్టి తరిమేశాడని కుమారుడు చెప్పాడు. బాలిక తల్లి, అదే కాలనీలో నివాసం ఉంటున్న వారు బాలుడి ఇంటి దగ్గరకు వెళ్లారు. బాలిక మిద్దె మీద నుండి కిందకు దిగి వచ్చింది. రక్తం కారుతున్న విషయం గుర్తించి ఇంటికి తీసుకు వెళ్లారు.
ఇంటిలో ఎక్కువ రక్తం పోవడంతో ప్రయివేటు ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. అక్కడి వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వెళ్లాలని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం బాలిక తిరువళ్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నది. బాలుడిని అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications