వాటర్ బాటిల్ తగిలి బాలుడు మృతి.. అసలు ఏం జరిగిందంటే ?
మరణం ఎప్పుడు, ఎక్కడ, ఎలా సంభవిస్తుందో ఎవరూ ముందుగా అంచనా వేయలేరు. ప్రతి ఒక్కరి జీవితంలో ఊహించని మలుపులు అనుకోని సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. కొన్నిసార్లు ఓ చిన్న నిర్లక్ష్యంతోనో, క్షణికావేశం తోనో విలువైన ప్రాణాలను కోల్పోతున్న ఘటనలను చూస్తూనే ఉంటున్నాం. అందుకే ప్రతి క్షణం జాగ్రత్తగా, బాధ్యతతో వ్యవహరించాలి. తోటి వారికి మన వల్ల ఏ ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి అని చెబుతుంటారు. కానీ 2025 మార్చి 14న గుజరాత్ రాష్ట్రం రాజ్ కోట్ జిల్లాలో చోటుచేసుకున్న ఓ సంఘటన మాత్రం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఓ 14 ఏళ్ల బాలుడు, తన స్నేహితులతో కలిసి షాపర్ వెరావల్ ప్రాంతంలో రైల్వే ట్రాక్ పక్కన నిలబడి ఉన్నాడు. ఆ సమయంలో ఓ ట్రైన్ నుంచి విసిరిన వాటర్ బాటిల్ అతని ఛాతీపై బలంగా తగిలింది. ఆ దెబ్బ తట్టుకోలేక బాలుడు క్షణాల్లోనే కిందపడిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా... డాక్టర్లు అతడు ప్రాణాలు కోల్పోయాడని ప్రకటించారు. ఈ ఊహించని ఘటనతో బాలుడి కుటుంబ సభ్యులే కాకుండా, విషయం తెలిసిన వారంతా కూడా నిర్ఘాంతపోతున్నారు. వాటర్ బాటిల్ కారణంగా ఒకరి ప్రాణం పోవడం ఏంటని తీవ్రంగా చర్చిస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బాదల్ సింగ్ గోడ్ ఠాకర్ అనే బాలుడు తన స్నేహితులతో కలిసి వెరావల్ ప్రాంతంలో రైల్వే ట్రాక్స్ సమీపంగా నిలబడి ఉండగా.. ట్రైన్ నుంచి ఎవరో వాటర్ బాటిల్ విసిరేశాయడంతో.. ఆ బాటిల్ బాదల్ ఛాతీ భాగానికి బలంగా తాకి పడిపోయాడు. వెంటనే అతని స్నేహితులు బాదల్ ను ఆస్పత్రికి తీసుకెళ్లగా.. డాక్టర్లు అప్పటికే మరణించాడని ధృవీకరించారు. ఈ క్రమంలోనే అసలు ఏం జరిగిందో నిగ్గు తేల్చాలని బాదల్ తండ్రి సంతోష్ సింగ్ ఏప్రిల్ 1న పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సంతోష్ సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించగా, ఆశ్చర్యకర నిజం వెలుగులోకి వచ్చింది. రైల్వే ట్రాక్స్ పరిసరాల్లో లభించిన సిసిటీవి వీడియోల ఆధారంగా ఆ వాటర్ బాటిల్ విసిరింది ట్రైన్ నడిపే అసిస్టెంట్ లోకో పైలట్ అని గుర్తించారు. ఈ మేరకు ట్రైన్ లో డ్యూటీ చేసిన శివ రామ్ గుర్జార్ ని అదుపులోకి తీసుకున్నారు. ఆ బాటిల్ తానే విసిరేశానని అందులో సగం బాటిల్ వరకూ నీళ్లు ఉన్నాయని శివ ఒప్పుకున్నాడు. దీంతో నిర్లక్ష్యం కారణంగా ఒకరి మరణానికి కారణమైనందుకు ఆయనపై కేసు నమోదు చేశారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications