నేటి నుంచి శీతలపానీయాలు పెప్సీ, కోక్ బంద్
తమిళనాడు వ్యాపారులు బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది షాపుల్లో పెప్సీ, కోక్ లను బహిష్కరించారు.
చెన్నై: టాప్ సాఫ్ట్ డ్రింక్ కంపెనీలు పెప్సీ, కోక్ లకు తమిళనాడు వ్యాపారులు షాక్ ఇచ్చారు. బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది షాపుల్లో పెప్సీ, కోక్ లను బహిష్కరించారు. స్థానిక తయారీదారులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో వాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.
దీంతో పెప్సీ, కోక్ లకు రూ.1400 కోట్ల మేర నష్టం వాటిల్లనుంది. రాష్ట్రంలోని అతిపెద్ద వాణిజ్య సంఘం తమిళనాడు వానిగర్ సంగమ్ ఈ పెప్సీ, కోక్ లను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది.
ఈ సంఘంలో ఆరు వేలకుపైగా చిన్న, మధ్య తరహా దుకాణాలు, 15 లక్షలకుపైగా సభ్యులు ఉన్నారు. చిన్న చిన్న దుకాణాలలోనూ ఇక నుంచి ఈ శీతలపానీయాలు అమ్మబోరని ఆ సంఘం స్పష్టం చేసింది.

పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు, రెస్టారెంట్లు కొంత సమయం కావాలని అడిగినా.. తాము అంగీకరించలేదని, బుధవారం సాయంత్రం దీనిపై సమావేశం కాబోతున్నామని ఆ సంఘం వెల్లడించింది.
గత జనవరి నెలలో జల్లికట్టు కోసం జరిగిన ఉద్యమం సందర్భంగా వాణిజ్య సంఘాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. బహుళజాతి కంపెనీలు తయారు చేసే శీతలపానీయాల వల్ల స్థానిక తయారీదారులు తీవ్రంగా నష్టపోతున్నారని తమిళనాడు వానిగర్ సంగమ్ కార్యదర్శి కె.మోహన్ పేర్కొన్నారు.
ఈ విదేశీ సంస్థలు విలువైన నీటి సంపదను కూడా దోచుకుంటున్నాయని, రాష్ట్రం కరువు పరిస్థితులు ఎదుర్కొంటున్న తరుణంలో బహుళ జాతి కంపెనీలు శీతలపానీయాల తయారీ పేరుతో నీటిని దోచుకోవడాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్..












Click it and Unblock the Notifications