ఉద్యోగం వస్తుందని గర్ల్ ఫ్రెండ్ ను హోటల్ కు పిలుచుకుని వెళ్లి ఏం చేశాడంటే ?

చెన్నై/ వేలూరు: ఓ యువతి బాగా చదువుకుని మంచి ఉద్యోగం చెయ్యాలని అనుకుంది. అయితే ఆమె డిగ్రీ వరకు మాత్రమే చదువుకుని ఉద్యోగం చెయ్యాలని అనుకుంది. ఉద్యోగం ఇస్తామని ఓ వ్యక్తి ఆమెను నమ్మించాడు. మంచి జీతం వస్తుందని, నువ్వు జీవితంలో సెటిల్ అయిపోతావని ఆమెను నమ్మించి ఏం చేశాడంటే ?.

తమిళనాడులోని వేలూరు (వెల్లూర్) జిల్లాలోని గుడియాతంలోని పుదుప్పేటలో ఓ యువతి నివాసం ఉంటున్నది. పీజీ వరకు చదివి మంచి ఉద్యోగం చెయ్యాలని ఆమె అనుకుంది. అయితే పరిస్థితులు అనుకూలించపోవడంతో డిగ్రీ వరకు చదువుకున్న ఆ యువతి మంచి ఉద్యోగం చెయ్యాలని, ఉద్యోగం చేస్తూ పీజీ చదువు పూర్తి చెయ్యాలని అనుకుంది.

boyfriend

ఇదే సమయంలో గుడియాతంలోనే నివాసం ఉంటున్న శంకర్ అనే వ్యక్తి ఆ యువతికి ఏడాది క్రితం పరిచయం అయ్యాడు. తరువాత ఇద్దరు ప్రేమించుకున్నారు. వేలూరు, చెన్నైలో ఉద్యోగం చెయ్యాలని యువతి ప్రయత్నిస్తున్నదని శంకర్ కు తెలిసింది. తనకు చాలా మంది పెద్దలు తెలుసని, మంచి ఉద్యోగం ఇప్పిస్తానని, నువ్వు మంచి జీతం తీసుకోవడానికి అవకాశం ఉందని శంకర్ అమాయకురాలైన యువతికి మాయమాటలు చెప్పాడు.

boyfriend

గుడియాతంలోని ఓ హోటల్ రూమ్ నెంబర్ 305లో ఇంటర్వూలు జరుగుతున్నాయని, నువ్వు అక్కడికి వస్తే నీకు ఉద్యోగం గ్యారెంటీగా వస్తుందని యువతికి ఆమె బాయ్ ఫ్రెండ్ శంకర్ నమ్మించాడు. శంకర్ మాయమాటలు నమ్మిన యువతి ఆ హోటల్ లోని రూమ్ నెంబర్ 305లోకి వెళ్లింది. అప్పటికే రూమ్ లో శంకర్ తో పాటు మరో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు.

అప్పటికే శంకర్ తో పాటు హోటల్ యజమాని మునిరత్నం అక్కడ ఉన్నారు. యువతి గదిలోకి రాగానే కిరాతకుడు శంకర్ తో పాటు హోటల్ యజమాని మునిరత్నం యువతి మీద అత్యాచారం చేశారు. ఉద్యోగం ఇప్పిస్తామని యువతి మీద సామూహిక అత్యాచారం చేసిన శంకర్, హోటల్ యజమాని మునిరత్నం ఈ విషయం బయటకు తెలిస్తే నిన్ను చంపేస్తామని ఆ యువతిని బెదిరించి హోటల్ లో నుంచి బయటకు పంపించేశారు. బాధితురాలు ఫిర్యాదు చేసిందని, ఆమెను వైద్య పరీక్షలకు తరలించి కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని గుడియాతం పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+