Girlfriend: కాలేజ్ అమ్మాయికి ఏమైయ్యింది, ప్రియుడు ఏం చేశాడు ?, మ్యాటర్ రిపీట్ !
చెన్నై/కన్యాకుమారి: దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. దంపతుల మూడో కుమార్తె ప్రైవేట్ కాలేజ్ లో డిగ్రీ చదువుతోంది. ప్రతిరోజు అమ్మాయి కాలేజ్ కు వెళ్లి వస్తోంది. కాలేజ్ అమ్మాయి ఓ యువకుడి ప్రేమలో పడింది. చాలాకాలం ప్రేమికులు ఎంజాయ్ చేశారు. మ్యాటర్ లీక్ కావడంతో అమ్మాయి మీద ఆమె కుటుంబ సభ్యులు మండిపడ్డారు. కొంతకాలం మౌనంగా ఉన్న కాలేజ్ అమ్మాయి అనారోగ్యానికి గురైయ్యింది. యువతిని ఆసుపత్రిలో చేర్పించారు. ఐసీయూలో చికిత్స విఫలమై కాలేజ్ అమ్మాయి చనిపోయింది. మా అమ్మాయికి ఆమె ప్రియుడు విషం పెట్టి హత్య చేశాడని ఆమె కుటుంబ సభ్యులు కేసు పెట్టడం కలకలం రేపింది.

కాలేజ్ అమ్మాయి
తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని నిత్రవలై సమీపంలోని వవరాయి ప్రాంతంలో చిన్నవర్ (56), తంగభాయ్ (53) దంపతులు నివాసం ఉంటున్నారు, చిన్నవర్, తంగభాయ్ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. దంపతుల మూడో కుమార్తె రజని (పేరు మార్చడం జరిగింది) కలియకలైలోని ఓ ప్రైవేట్ కాలేజ్ లో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది.

ప్రేమలో పడిన కాలేజ్ అమ్మాయి
చిన్నవర్, తంగభాయ్ ఇద్దరు కుమార్తెలకు ఇప్పటికే వివాహం చేశారు. ఇద్దరు కుమార్తెలు వారి భర్తలతో సంతోషంగా జీవిస్తున్నారు. మూడో అమ్మాయిని బాగా చదివించి మంచి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చెయ్యాలని చిన్నవర్, తంగభాయ్ దంపతులు అనుకున్నారు. అయితే కాలేజ్ అమ్మాయి రజనవి నిత్రవలా ప్రాంతంలో నివాసం ఉంటున్న వరుణ్ అనే అబ్బాయి ప్రేమలో పడింది.

ఎంజాయ్ చేసిన ప్రేమికులు
వరుణ్, రజని పాఠశాలలో చదుతున్నప్పటి నుంచి స్నేహితులు. కాలేజ్ లో ప్రేమలో పడిన రజని, వరుణ్ హ్యాపీగా తిరుగుతూ ఎంజాయ్ చేశారు. రజని మ్యాటర్ లీక్ కావడంతో ఆ అమ్మాయి మీద ఆమె కుటుంబ సభ్యులు మండిపడ్డారు. నువ్వు వరుణ్ తో తిరగడానికి వీలులేదని, మీరు పెళ్లి చేసుకోవడం కుదరని రజని కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు.

ప్రియుడి మీద కేసు పెట్టిన అమ్మాయి తల్లి
కొంతకాలం మౌనంగా ఉన్న కాలేజ్ అమ్మాయి రజని ఎవ్వరితో మాట్లాడటం లేదని తెలిసింది. ఈనెల 1వ తేదీన అనారోగ్యానికి గురైన రజనిని కన్యాకుమారిలోని ఆసుపత్రిలో చేర్పించారు. నాలుగు రోజుల క్రితం రజనిని కేరళలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న రజని చికిత్స విఫలమై కాలేజ్ అమ్మాయి చనిపోయింది.

ఎలా చనిపోయింది ?
మా అమ్మాయికి ఆమె ప్రియుడు వరుణ్ స్లోపాయిజన్ ఇచ్చి హత్య చేశాడని ఆమె తల్లి తంగభాయ్ కన్యాకుమారి జిల్లా పోలీసులకు ఫిర్యాదు చెయ్యడం కలకలం రేపింది. కాలేజ్ అమ్మాయి విషం తాగి ఆత్మహత్య చేసుకుందా, ప్రియుడు స్లోపాయిజన్ ఇచ్చి చంపేశాడా, లేక ఆమె ఎలా చనిపోయింది అని విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications