Boyfriend: హ్యాండ్ ఇచ్చిన ప్రియుడు, మొబైల్ స్విచ్ ఆఫ్, తేడా వచ్చిందని ప్రియురాలు ?
బెంగళూరు/ కారవార/మంగళూరు: ప్రేమించిన యువకుడు ప్రియురాలితో కలిసి కొంతకాలం ఎంజాయ్ చేశాడు. ప్రియుడు దూరపు బంధువు కావడంతో వారి పెళ్లి చెయ్యడానికి అమ్మాయి కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న యువకుడు లాక్ డౌన్ తో ఊరికి వెళ్లి ప్రియురాలితో కలిసి తిరిగి ఎంజాయ్ చేశాడు. మా ఇంట్లో అందరిని ఒప్పించి పెళ్లి చేసుకుంటానని వెళ్లిన ప్రియుడు అతని మొబైల్ నెంబర్ మార్చేసి మాయం అయిపోయాడు. ప్రియుడు మోసం చేసి జెండా ఎత్తేశాడని ఆవేదన చెందిన ప్రియురాలు ఆవేశంలో షాకింగ్ నిర్ణయం తీసుకోవడం కలకలం రేపింది.

పక్కింటికి వస్తుంటే పరిచయం
కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలోని సిద్దాపుర తాలుకా దసగెద్ద ప్రాంతంలో నివాసం ఉంటున్న పల్లవి (23) సిద్దాపురలోని ఓ బట్టల షాపులో నాలుగు సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నది. పల్లవి పక్కింటిలో నివాసం ఉంటున్న బంధువుల ఇంటికి పవన్ (24) అనే యువకుడు వచ్చి వెలుతున్న సమయంలో ఇద్దరికీ పరిచయం అయ్యింది.

బెంగళూరు ప్రియుడు
పవన్ బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. బంధువుల ఇంటికి వెళ్లి వస్తున్న సమయంలో పరిచయం అయిన పల్లవితో పవన్ ప్రేమలో పడ్డాడు. పల్లవి కూడా పవన్ ను ఇష్టపడటంతో అప్పటి నుంచి ఇద్దరూ హ్యాపీగా తిరిగి ఎంజాయ్ చేశారు. గత ఏడాది పెళ్లి చేసుకోవాలని పవన్, పల్లవి డిసైడ్ అయ్యారు. కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా బెంగళూరులో ఉన్న పవన్ సొంత ఊరికి వెళ్లిపోయాడు.

అమ్మాయి ఇంట్లో గ్రీన్ సిగ్నల్
పవన్, పల్లవి ఇద్దరూ దూరపు బంధువులు. తాను పవన్ ను పెళ్లి చేసుకుంటానని, లేదంటే జీవితంలో ఎవ్వరిని పెళ్లి చేసుకోనని పల్లవి ఆమె ఇంట్లో తేల్చి చెప్పింది. పవన్ తో పెళ్లి చెయ్యడానికి పల్లవి ఇంట్లో అందరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే తన అక్కకు పెళ్లి అయిపోయిన తరువాత తాను పెళ్లి చేసుకుంటానని, అందుకు రెండు సంవత్సరాలు పడుతుందని ప్రియుడు పవన్ కొంతకాలం గడిపేశాడు.

నాటకాలు ఆడిన ప్రియుడు ఎస్కేప్
మా ఇంట్లో అందరిని ఒప్పించిన తరువాత పెళ్లి చేసుకుంటానని చెప్పి వెళ్లిన పవన్ తరువాత అతని మొబైల్ నెంబర్ మార్చేసి ప్రియురాలు పల్లవికి కనపడకుండా మాయం అయిపోయాడు. పవన్ పాత ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ వచ్చింది. పవన్ తో మాట్లాడాలని పల్లవి అనేక ప్రయత్నాలు చేసి విఫలం అయ్యింది. ప్రేమించిన పవన్ తనను మోసం చేశాడని పల్లవి ఆవేదన చెందింది.

ఆవేదనతో ప్రియురాలు ఆత్మహత్య
పవన్ తనను పెళ్లి చేసుకోడని ఆవేదనతో పల్లవి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పవన్ తన కూతురిని మోసం చెయ్యడం వలనే ఆమె ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తూ పల్లవి తండ్రి నారాయణ సిద్దాపుర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పవన్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్దోందని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
-
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!!












Click it and Unblock the Notifications