పెట్రోలియం రిఫైనరీలో అగ్నిప్రమాదం: 43 మందికి గాయాలు

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని చంబూర్‌ ప్రాంతంలో ఉన్న భారత్‌ పెట్రోలియంకు చెందిన రిఫైనరీ ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 43 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థతి విషమంగా ఉంది.

 BPCL shuts fire-hit hydrocracker unit at Mumbai refinery, over 40 injured

బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న 7 అగ్నిమాపక వాహనాలు, రెండు భారీ ట్యాంకర్లు, రెండు ఫోమ్‌ వాహనాలు సంఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపుచేశాయి.

మొత్తం 22 మంది స్వల్ప గాయాలతో బయటపడగా.. 21 మందిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 4 కిలోమీటర్ల మేర దీని ప్రభావం కనిపించిందని అక్కడి స్థానికులు చెబుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+