బ్యాంకు మేనేజర్, అకౌంటెంట్ కిడ్నాప్: రూ. 20 లక్షల డిమాండ్
జమాయి: బీహార్ రాష్ట్రంలో కిడ్నాపర్లు రెచ్చిపోయారు. ఏకంగా ఓ జాతీయ బ్యాంకు మేనేజర్ తోపాటు అకౌంటెంట్‌ను కిడ్నాప్ చేశారు. ఈ ఘటన జమాయి జిల్లాలో చోటు చేసుకుంది. వారిని విడిచిపెట్టాలంటే రూ. 20 లక్షలు చెల్లించాలని కిడ్నాపర్లు డిమాండ్ చేస్తున్నారని పోలీసులు తెలిపారు.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళుతుండగా ఆ అధికారులు కిడ్నాప్‌కు గురయ్యారు. అయితే సదరు అధికారుల కుటుంబసభ్యులు మాత్రం ఇప్పటి వరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలిపారు.

కిడ్నాపర్ల బెదిరింపుల కారణంగా వారి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయలేదని పోలీసులు భావిస్తున్నారు. కిడ్నాపర్ల చెరలో ఉన్న ఆ ఇద్దరు అధికారులను రాజ్ల కెనరా బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ ఓం ప్రకాశ్ పాశ్వాన్, రంజిత్ కుమార్‌లుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. పాశ్వాన్‌కు సంబంధించిన ద్విచక్ర వాహనాన్ని శాటిఘాట్ ప్రాంతంలో గుర్తించినట్లు చెప్పారు.
అయితే కిడ్నాప్ చేసింది మావోయిస్టులా లేక నేరస్తులా అనేది తేలాల్సి ఉందని పోలీసులు చెప్పారు. కిడ్నాప్ చేసిన దుండగులను పట్టుకునేందుకు ఇప్పటికే తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. అతి త్వరలో నిందితులను పట్టుకుని, అధికారులను క్షేమంగా తీసుకొస్తామని చెప్పారు.
-
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
కేబినెట్ భేటీలో ప్రధాని మోదీ సంచలన నిర్ణయాలు ఇవే.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!!












Click it and Unblock the Notifications