పుల్వామా దాడి మా పనే: నిజం ఒప్పుకున్న పాకిస్థాన్

2019లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుల్వామా దాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని తేలిపోయింది. పుల్వామా దాడిలో తమ దేశం అస్తం ఉందని ఏకంగా పాకిస్థాన్ వాయు సేనాధికారి చెప్పడం సంచలనం రేపుతోంది. దీంతో పాకిస్థాన్ కు ఉగ్రవాదులతో మంచి సంబంధాలు ఉన్నాయనేది తేటతెల్లం అయింది. 2019 ఫిబ్రవరి 14న జమ్ము శ్రీనగర్ లోని పుల్వామాలో ఈ దాడి జరిగింది.

2019 ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా దాడిలో 40 మంది భారత పారా మిలటరీ సిబ్బంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ భీకర దాడికి కారణం తమ దేశమేనని పాకిస్థాన్ సైనిక ఉన్నతాధికారి ఔరంగజేబ్‌ అహ్మద్‌ తెలిపారు. పుల్వామా దాడిలో పాకిస్థాన్ సైన్యం హస్తం ఉందని ఈ మేరకు ప్రెస్‌ మీట్‌లో అంగీకరించారు. అయితే ఈ దాడి జరిగినప్పటి నుంచి తమకు సంబంధం లేదని పాకిస్థాన్ బుకాయిస్తూ వస్తోంది. ఈ సారి ఏకంగా ఆ దేశ సైనిక ఉన్నతాధికారి అంగీకరించడంతో యావత్ భారతావని పాకిస్థాన్ పై మరింత ఆగ్రహంతో రగిలిపోతోంది.

Breaking Pakistan Admits to Pulwama Attack Involvement

భారత్- పాకిస్థాన్ సీజ్ ఫైర్ అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాకిస్థాన్ వైమానిక దళానికి చెందిన పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్, ఎయిర్ వైస్ మార్షల్ ఔరంగజేబ్ అహ్మద్ ఈ వ్యాఖ్యలు చేశారు. పుల్వామాలో తమ వ్యూహాత్మక చాకచక్యాన్ని భారత్ కు చాటి చెప్పడానికి ప్రయత్నించామని అన్నారు. ఈ సమావేశంలో పాకిస్థాన్ సైన్యానికి చెందిన డైరెక్టర్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌద్రీ, నౌకాదళ ప్రతినిధి.. తదితరులు పాల్గొన్నారు.

పుల్వామా దాడి దేశ చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోయింది. జమ్ము - శ్రీనగర్ జాతీయ రహదారిలో భారత సైనికులను తీసుకెళ్తున్న వాహనాల కాన్వాయ్ మీద అవంతి పురా సమీపంలోని పుల్వామా వద్ద కారుతో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో 40 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) సైనికులు మృతి చెందారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+