Breakup: పెళ్లికి ముందే అక్రమ సంబంధం, గుడ్ బై చెప్పిన గర్ల్ ఫ్రెండ్, కసితో కత్తి కడుపులోనే వదిలేశాడు !

బెంగళూరు/మంగళూరు: యువతి, యువకుడికి పరిచయం అయ్యింది. కొంతకాలం తరువాత ఇద్దరూ ప్రేమించుకున్నారు. మూడు సంవత్సరాలు ప్రేమికులు హ్యాపీగా తిరిగారు. ప్రియురాలి ఇంటిలో ఎవ్వరూ లేని సమయంలో ప్రియుడు ఆమె ఇంటికి వెళ్లి కొన్ని గంటల పాటు కాలక్షేపం చేసి తరువాత వెళ్లేవాడు. కులాలు వేరు అయినా ప్రేమికులు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇటీవల ప్రియుడు దారితప్పి చెడు అలవాట్లకు బానిస కావడం, వేరే వివాహిత మహిళతో అక్రమ సంబందం పెట్టుకుని ఆమెతో తిరగడం చేశాడని అతని ప్రియురాలికి తెలిసిపోయింది. ప్రియుడిని దూరం పెట్టిన ప్రియురాలు వేరే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించింది. ప్రియురాలి ఇంటికి వెళ్లిన ప్రియుడు ఆమెను కత్తితో పొడిచి కసితో కత్తికూడా ఆమె కడుపులోనే పూర్తిగా చెక్కేయడం కలకలం రేపింది.

ప్రియురాలి ఇంట్లోకి చొరబడి ?

ప్రియురాలి ఇంట్లోకి చొరబడి ?

ఇంట్లో ఒంటరిగా ఉన్న దళిత యువతి ఇంట్లోకి ప్రవేశించి మాజీ ప్రియుడు ఆమెను దారుణంగా హత్య చేశాడు. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని పుత్తూరు తాలూకాలోని ముండూరు సమీపంలోని గ్రామంలో నివాసంఉంటున్న జయశ్రీ (23) అనే దళిత యువతి హత్యకు గురి కావడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. ఇంట్లో జయశ్రీ ఒంటరిగా ఉందని తెలుసుకున్న ఆమె మాజీ ప్రియుడు ఉమేష్ ఆమె ఇంటి దగ్గరకు వెళ్లాడు.

యువతి గురించి పూర్తిగా తెలుసు

యువతి గురించి పూర్తిగా తెలుసు

తనను పెళ్లి చేసుకోవలని ఉమేష్ అతని ప్రియురాలు జయశ్రీ మీద ఒత్తిడి చేశాడు. అయితే నీ గురించి నాకు పూర్తిగా తెలిసిపోయిందని, చచ్చినా నిన్ను పెళ్లి చేసుకోను అని జయశ్రీ తేల్చి చెప్పింది. ఆ సందర్బంలో జయశ్రీతో ఆమె మాజీ ప్రియుడు ఉమేష్ గొడవపడ్డాడు. సహనం కోల్పోయిన నిందితుడు ఉమేష్ కత్తి తీసుకుని అతని మాజీ ప్రియురాలు జయశ్రీని చాలాసార్లో ఆమె కడుపులో పొడిచేశాడు. జయశ్రీ కడుపులో కత్తిని అలాగే వదిలేసిన నిందితుడు ఉమేష్ ఇంటి బయట డోర్ కు చిలుకు పెట్టి అక్కడి నుంచి పరారయ్యాడు.

ప్రియురాలి ప్రాణాలు పోయాయి

ప్రియురాలి ప్రాణాలు పోయాయి

రక్తపు మడుగులో పడి ఉన్న జయశ్రీని స్థానికులు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే మార్గం మధ్యంలోనే జయశ్రీ మృతి చెందింది. సమాచారం అందుకున్న వెంటనే సంప్య గ్రామీణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివిధ కోణాల్లో దర్యాప్తు చేశారు. డాగ్ స్క్వాడ్, వేలిముద్రల నిపుణులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. దక్షిణ కన్నడ ఎస్పీ రిషికేష్ సోనానా కూడా సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. హత్యకు గురైయ్యింది దళిత యువతి కావడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

పెళ్లికి ముందే ప్రియుడికి అక్రమ సంబంధం

పెళ్లికి ముందే ప్రియుడికి అక్రమ సంబంధం

కొంతకాలంగా జయశ్రీతో ప్రేమాయణం సాగిస్తున్న ఉమేష్ తరచూ జయశ్రీ ఇంటిలో ఎవ్వరూ లేని సమయంలో ఆమె ఇంటికి వచ్చి వెళ్లేవాడని గ్రామస్తులు చెబుతున్నారు. ఉమేష్ వివాహిత మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడం, రానురాను అతని ప్రవర్తన నచ్చక జయశ్రీ గత ఏడాది నవంబర్ నుంచి ఉమేష్ ను దూరం పెట్టిందని, దీంతో ఉమేష్ మనస్తాపానికి గురైనాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. జయశ్రీ వేరే యువకుడిని పెళ్లి చేసుకోవడానికి సిద్దం అవుతోందని రగిలిపోయిన ఉమేష్ ఆమెను దారుణంగా హత్య చేశాడని పోలీసు అధికారులు అంటున్నారు.

కొన్ని గంటల్లో చిక్కిన ప్రియుడు

కొన్ని గంటల్లో చిక్కిన ప్రియుడు

రెండేళ్ల క్రితం తండ్రిని కోల్పోయిన జయశ్రీ ఆమె తల్లితో కలిసి ఈ ఇంట్లోనే ఉంటోంది. జయశ్రీ సోదరుడు మంగళూరులో చదువుకుంటున్నాడు. జయశ్రీ తల్లి తోట పనికి వెలుతోంది. జయశ్రీ హత్యకు గురైన కొన్ని గంటల్లోనే నిందితుడు ఉమేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సుళ్యలోని కనకమజలుకు చెందిన ఉమేష్‌ హత్యకు పాల్పడ్డాడని పోలీసులు చెప్పారు. జయశ్రీ తల్లి గిరిజ కేసు పెట్టారని, ఉమేష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+