BRICS Summit 2026: ప్రధాని మోదీ దౌత్య విజయం..'దిల్లీ డిక్లరేషన్' కు బ్రిక్స్ దేశాలు ఏకగ్రీవంగా ఆమోదం..
బ్రిక్స్ సమావేశంలో న్యూ దిల్లీ డిక్లరేషన్ 2026 కు బ్రిక్స్ కూటమిలోని సభ్య దేశాలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. బ్రిక్స్ సమావేశానికి ఆతిథ్యం ఇచ్చిన భారత్ కు ఇది అతిపెద్ద దౌత్య విజయం అని చెప్పొచ్చు. భారత్ న్యూ దిల్లీ డిక్లరేషన్ కు కూటమిలోని ఏ దేశం కూడా అభ్యంతరం చెప్పకపోవడం విశేషం. ఇది ఏకగ్రీవంగా ఆమోదం పొందిందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు.
భౌగోళిక రాజకీయ అంశాలపై సభ్య దేశాల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ న్యూ దిల్లీ డిక్లరేషన్ కు ఏకాభిప్రాయం లభించడం భారత్ కు అతిపెద్ద దౌత్య విజయంగా నిలుస్తుందని అన్నారు. అంతర్జాతీయ విధానాలు, ఆర్థిక సహకారం, శాంతిభద్రతలపై సభ్య దేశాల ఉమ్మడి నిబద్ధతను ఈ నిర్ణయం చాటిచెబుతోందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఇక రెండు రోజుల పాటు జరిగే ఈ 18వ బ్రిక్స్ సమావేశంలో భారత్, రష్యా, చైనా, బ్రెజిల్, ఈజిప్ట్, ఇండోనేషియా, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా సహా మొత్తం 21 దేశాలు పాల్గొన్నాయి. అయితే విబేధాలు పక్కన పెట్టి మరీ ఇరాన్, యూఏఈ, సౌదీ అరేబియా దేశాలు న్యూ దిల్లీ డిక్లరేషన్ కు ఆమోదం తెలపడం కీలకంగా మారింది.

న్యూ దిల్లీ డిక్లరేషన్ లోని కీలక విషయాలు చూస్తే.. ప్రపంచ వాణిజ్య సంస్థల నిబంధనలకు విరుద్ధంగా, వాణిజ్యాన్ని దెబ్బతీసే విధంగా ఏకపక్ష సుంకాలు పెరగడంపై బ్రిక్స్ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి ఏకపక్ష చర్యలను బ్రిక్స్ దేశాలు ఖండించాయి. అలాగే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న యుద్ధాలు, ఘర్షణలను శాంతి యుతంగా, దౌత్య పరంగా మాత్రమే పరిష్కరించుకోవడానికి తాము కట్టుబడి ఉన్నామని బ్రిక్స్ కూటమి స్పష్టం చేసింది. అలాగే ప్రపంచంలో నెలకున్న సమస్యలపై వివిధ దేశాలు చూసే దృక్కోణాన్ని తాము స్వాగతిస్తున్నట్లు తెలిపాయి. దాంతోపాటు అంతర్జాతీయ సమస్యలపై శాంతి యుత చర్చలు, భాగస్వామ్యాన్ని నొక్కి చెప్పాయి.
BRICS New Delhi Declaration | We reaffirm our commitment to the BRICS spirit of mutual respect and understanding, sovereign equality, solidarity, democracy, openness, inclusiveness, collaboration and consensus. Building on two decades of BRICS, we further commit ourselves to… pic.twitter.com/h2Q9N7S86h
— ANI (@ANI) September 12, 2026
అలాగే గతేడాది ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిని బ్రిక్స్ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఇది క్రిమినల్ చర్య అని ఎప్పటికీ క్షమించరానిదాని తెలిపాయి. ఈ ఘోర ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోగా.. మరెందరో గాయపడినట్లు వివరించాయి. ఇలాంటి ఉగ్రవాద చర్యలను అసలు ఉపేక్షించేది లేదని బ్రిక్స్ కూటమి దేశాలు స్పష్టం చేశాయి. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఎదుర్కొనేందుకు తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించాయి. వీటితోపాటు మారుతున్న, వర్తమాన ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణ సంస్కరణలు చేపట్టాలని బ్రిక్స్ దేశాలు డిమాండ్ చేశాయి. భారత్ నేతృత్వంలో ఈ బ్రిక్స్ సదస్సు 'Humanity First' ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతుందని తీర్మానించాయి.












Click it and Unblock the Notifications
