Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Bride escape: 18 రోజులు భర్తతో కాపురం, టేస్ట్ బాగాలేదని ప్రియుడితో భార్య జంప్, సర్దుకుని చెక్కేసింది !

భోపాల్/ మధ్యప్రదేశ్/ బెంగళూరు: గ్రాండ్ గా పెళ్లి చేసుకున్న నవదంపతులు రెండు వారాలకు పైగా సంతోషంగా ఉన్నారు. పెళ్లి కొడుకు ఇంటికి వెళ్లి నవవధువు 18 రోజుల పాటు భర్తతో సంసారం చేసింది. భర్తతో 18 రోజులు కాపురం చేసిన పెళ్లి కూతురు తన టేస్ట్ కు తగ్గట్లుగా పెళ్లి కొడుకు లేడని డిసైడ్ అయ్యిందో ఏమో కానీ అన్నీ సర్దుకుని గతంలో ప్రేమించిన ప్రియుడితో పాటు చెక్కేసింది. పెళ్లి కూతురు ఎంజాయ్ చెయ్యడానికి ప్రియుడితో కలిసి పారిపోతూ పోతూ రూ. 5 లక్షల విలువైన బంగారు నగలు, రూ. 20 వేల నగదు ఎత్తుకుని వెళ్లిపోయింది. ఇప్పుడు పెళ్లి కొడుకు బోరున విలపిస్తూ పోలీసులను ఆశ్రయించడంతో అందరూ షాక్ అయ్యారు.

 గ్రాండ్ గా పెళ్లి చేసిన ఫ్యామిలీ

గ్రాండ్ గా పెళ్లి చేసిన ఫ్యామిలీ

మధ్యప్రదేశ్ లోని భత్తర్ పూర్ జిల్లాలోని జలౌల్ ప్రాంతానికి చెందిన రాహుల్ (25) అనే వ్యక్తికి, భిరావరి ప్రాంతానికి చెందిన మూర్తి రైక్వార్ (20) అనే యువతికి డిసెంబర్ 6వ తేదీన గ్రాండ్ గా పెళ్లి జరిగింది. రాహుల్, రైక్వార్ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, ఇరు గ్రామాల ప్రజలు పెళ్లికి హాజరై నవదంపతులను ఆశీర్వదించి కడుపునిండా వింధు భోజనం చేసి వెళ్లారు.

 18 రోజులు ఎంజాయ్

18 రోజులు ఎంజాయ్

పెళ్లి జరిగిన తరువాత పెళ్లి కూతురు రైక్వార్ ఇంట్లో రెండు రోజుల పాటు పెళ్లి కొడుకు రాహుల్ ఉన్నాడు. తరువాత రాహుల్ ఇంటికి రైక్వార్ ను ఆమె కుటుంబ సభ్యులు పంపించారు. 18 రోజుల పాటు పెళ్లి కొడుకు రాహుల్ తో నవవధువు రైక్వార్ చాలా సంతోషంగా గడిపింది. 18 రోజుల పాటు రాహుల్, రైక్వార్ ఎంజాయ్ చేశారు.

 మొగుడి టేస్ట్ సరిపోలేదో ఏమో, సూపర్ స్కెచ్ !

మొగుడి టేస్ట్ సరిపోలేదో ఏమో, సూపర్ స్కెచ్ !

18 రోజుల పాటు భర్త రాహుల్ తో సంతోషంగా గడిపిన రైక్వార్ తాను పుట్టింటికి వెళ్లి వస్తానని చెప్పింది. కొత్తగా పెళ్లి చేసుకుని తన ఇంటికి వచ్చిందని, తల్లిదండ్రులను చూడాలని ఆశపడుతోందని పోరబడిన రాహుల్ సరే అన్నాడు. రెండు వారాలకు పైగా భర్త రాహుల్ తో కాపురం చేసిన రైక్వార్ తన టేస్ట్ కు తగ్గట్లుగా భర్తలేడని డిసైడ్ అయ్యి అత్తగారింటి నుంచి నేరుగా పుట్టింటికి వెళ్లిపోయింది.

 ప్రియుడితో చెక్కేసిన పెళ్లి కూతురు

ప్రియుడితో చెక్కేసిన పెళ్లి కూతురు

కొన్ని రోజులు పుట్టింటిలో ఉన్న రైక్వార్ తరువాత తాను అత్తగారింటికి వెలుతున్నానని తల్లిదండ్రులకు చెప్పి బయలుదేరింది. అయితే రైక్వార్ మాత్రం భర్త రాహుల్ ఇంటికి వెళ్లకుండా భిరవారి గ్రామంలోనే నివాసం ఉంటున్న ప్రియుడు రాజేష్ తో కలిసిపారిపోయింది. పుట్టింటి నుంచి బయలుదేరి రెండు రోజులు అయినా తన భార్య రైక్వార్ ఇంటికి రాకపోవడంతో హడలిపోయిన రాహుల్ పోలీసులను ఆశ్రయించాడు.

 రెండోసారి ప్రియుడితో ఎస్కేప్

రెండోసారి ప్రియుడితో ఎస్కేప్

నవవధువు పుట్టింటి నుంచి బయలుదేరిన సమయంలో ఆమె దగ్గర రూ. 5 లక్షలకు పైగా విలువైన బంగారు నగలు, చేతిలో 20 వేల రూపాయల డబ్బు ఉందని ఆమె తల్లిదండ్రులు ఆలీపూర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. గత డిసెంబర్ 24వ తేదీన ప్రియుడు రాజేష్ తో కలిసి రైక్వార్ పారిపోయిందని, తరువాత ఆమెను పట్టుకుని వచ్చి ఇంట్లో పెట్టారని పోలీసుల విచాణలో వెలుగు చూసింది.

 రూ. 5 లక్షల నగలతో జంప్ జిలాని

రూ. 5 లక్షల నగలతో జంప్ జిలాని

ప్రేమించిన ప్రియుడు రాజేష్ తో పారిపోవడానికి స్కెచ్ వేసిన రైక్వార్ పక్కాప్లాన్ ప్రకారం రూ. 5 లక్షల నగలు, ఖర్చులకు రూ. 20 వేలు ఎత్తుకుని చెక్కేసిందని తెలుసుకున్న ఆమె బంధువులు షాక్ అయ్యారు. 18 రోజులు భర్తతో కాపురం చేసిన రైక్వార్ పక్కాప్లాన్ తెలుసుకున్న పోలీసులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రియుడితో చెక్కేసిన రైక్వార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+