వధువు ఇచ్చిన షాక్‌కు వరుడి 'మైండ్ బ్లాంక్': దెబ్బకు తాగింది దిగవచ్చు!..

Subscribe to Oneindia Telugu

పాట్నా: మద్యపాన నిషేధం విషయంలో బీహార్ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. మరీ ముఖ్యంగా.. మద్యపానం సేవించే వ్యక్తుల పట్ల అక్కడి అమ్మాయిలు వ్యవహరిస్తున్న తీరు అందరి ప్రశంసలు అందుకుంటోంది. వరుడు మద్యం తాగినట్లు తెలిస్తే.. పీటల మీద పెళ్లి ఆపడానికైనా వారు వెనుకాడటం లేదు.

ఇటీవల వరుసగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోగా.. తాజాగా ఈ జాబితాలో మరో ఘటన చేరింది. వైశాలీ జిల్లా హారౌలీభట్టీకి చెందిన చందన్ చౌదరి అనే యువకుడికి ఓ యువతితో శుక్రవారం నాడు వివాహం నిశ్చయమైంది. పెళ్లి సమయానికి భాజాభజంత్రీల మధ్య చందన్ చౌదరి తన బంధుమిత్రులతో కలిసి వధువు ఇంటికి వచ్చాడు.

Bride refuses to marry drunken groom in bihar

పురోహితుడి వేద మంత్రోచ్చరణల నడుమ వివాహ తంతు కొనసాగుతుండగా.. వరుడి నోటి నుంచి 'మద్యం' వాసన రావడం వధువు పసిగట్టింది. అంతే, అప్పటికప్పుడే పెళ్లి రద్దు చేసి.. ఇలాంటి వరుడు తనకు వద్దంటూ తెగేసి చెప్పింది. దెబ్బకు తాగింది దిగేలా వరుడి మైండ్ బ్లాంక్ అయింది. పెళ్లి వద్దని వధువు చెప్పడంతో.. ఆమె తల్లిదండ్రులు వరుడి కుటుంబానికి ఇచ్చిన కట్నం డబ్బులను వెనక్కి తీసుకున్నారు. గ్రామస్తులు కూడా ఇందుకు సహకరించారు.

బీహార్ లో మద్యపాన నిషేధం ఉన్నప్పటికీ.. చాలామంది మందుబాబులు మత్తులో తూలుతూనే ఉన్నారు. పెళ్లి రోజు కూడా మందు కొట్టి మంటపానికి వస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. దీంతో అక్కడి అమ్మాయిలు తాగుబోతు వ్యక్తులు తమకు భర్తలుగా వద్దని తెగేసి చెబుతున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Drinking alcohol and going for his wedding proved costly for a bridegroom in Bihar on Friday.
Please Wait while comments are loading...