మణిపూర్ లో భారీ స్థాయిలో ఓటింగ్.. ప్రజల అమితాసక్తి
మణిపూర్ అసెంబ్లీ తొలిదశ ఎన్నికల్లో భారీగా పోలింగ్ జరుగుతోంది. శనివారం మధ్యాహ్నం ఒంటి గంట వరకే 69 శాతం ఓటింగ్ నమోదైంది.
న్యూఢిల్లీ: మణిపూర్ అసెంబ్లీ తొలిదశ ఎన్నికల్లో భారీగా పోలింగ్ జరుగుతోంది. శనివారం మధ్యాహ్నం ఒంటి గంట వరకే 69 శాతం ఓటింగ్ నమోదైంది. ప్రజలు కూడా ఓటు వేసేందుకు అమితోత్సాహం చూపిస్తున్నారు.
ఉదయం నుంచే పోలింగ్ స్టేషన్ల ముందు బారులు తీరారు. ఉదయం 11 గంటలకల్లా 43 శాతం ఓటింగ్ నమోదైంది. సాయంత్రానికి భారీ ఓటింగ్ శాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది.

ఈ రోజు తొలి దశలో 38 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మణిపూర్ ఉక్కుమహిళ, పీఆర్జేఏ అధ్యక్షురాలు ఇరోమ్ షర్మిల 20 ఏళ్ల తరువాత మళ్లీ తన ఓటుహక్కును వినియోగించుకున్నారు.
ఈరోజు ఉత్తరప్రదేశ్ లో ఆరో దశ పోలింగ్ జరుగుతోంది. మణిపూర్ తో పోల్చితే యూపీలో తక్కువ ఓటింగ్ శాతం నమోదవుతోంది. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలు మరొక్క దశతో ముగుస్తాయి. మార్చి 11న వీటితోపాటు ఇప్పటికే ఎన్నికలు పూర్తయిన పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్ ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది.












Click it and Unblock the Notifications