మాల్యా - నీరవ్ మోదీ అప్పగింత : పీఎం మోదీతో చర్చల వేళ : బ్రిటన్ ప్రధాని ఏం చెప్పారు..!!
భారత్ లోని బ్యాంకులను వేల కోట్లు మోసిగించి లండన్ పారిపోయిన ఆర్దిక నేరగాళ్ల గురించి బ్రిటన్ ప్రధాని కీలక వ్యాఖ్యలు చేసారు. భారత్ ప్రధాని మోదీతో చర్చల సమయంలో ఈ అంశం సైతం ప్రస్తావనకు వచ్చినట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్దన్ ష్రింగ్లా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఇది ప్రధానమైన విషయమని చెప్పడంతో దీనిపై సమీక్షిస్తానని బోరిస్ జాన్సన్ హామీ ఇచ్చినట్లుగా వెల్లడించారు. బ్యాంకులను మోసగించి లండన్ పారిపోయిన ఆర్థిక నేరగాళ్లు విజయ్ మాల్యా, నీరవ్ మోదీ అప్పగింతపై బ్రిటన్ ప్రధాని చేసిన వ్యాఖ్యలను అందులో ప్రస్తావించారు.
కొన్ని న్యాయపరమైన అంశాల కారణంగానే అప్పగించడం కుదరట్లేదని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు. నేరారోపణలు ఎదుర్కొంటున్న వారు భారత్‌లో విచారణ ఎదుర్కోవాలని తామూ కోరుకుంటున్నామని చెప్పారు. వారిని అప్పగించేందుకు బ్రిటన్ ప్రభుత్వం ఆదేశించినప్పటికీ.. కొన్ని న్యాయపరమైన అంశాలతో క్లిష్టంగా మారిందని వ్యాఖ్యానించారు. భారత్ నుంచి ప్రతిభ గల వ్యక్తులు రావడానికి తాము ఆహ్వానించటానికి సిద్దంగా ఉంటామని బ్రిటన్ ప్రధాని చెప్పుకొచ్చారు. అదే సమయంలో..తమ న్యాయవ్యవస్థను ఉపయోగించుకుని భారతీయ చట్టాల నుంచి తప్పించుకోవాలనుకునే వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగకీరించమని బోరిస్ జాన్సన్ తేల్చి చెప్పారు.

భారత్‌తో తమ సంబంధాలు ప్రతిరంగంలోనూ బలోపేతం అయ్యాయని బ్రిటన్ ప్రధాని పేర్కొన్నారు. భారత ప్రధాని మోదీని తనకు ప్రత్యేకమైన మిత్రుడు అని కొనియాడారు. తన పర్యటన ద్వారా రెండు దేశాల మధ్య బంధం మరింత ముందుకు బలోపేతం అయ్యేందుకు ఉపకరిస్తుంని ఆకాక్షించారు. అనేక రూపాల్లో ఎదురవుతున్న ముప్పును ఎదుర్కొనేందుకు రెండు దేశాలు కలిసి పని చేయాలని నిర్ణయానికి వచ్చినట్లుగా బ్రిటన్ ప్రధాని వెల్లడించారు. రక్షణ రంగంలో భారత్‌లో తయారీకి బోరిస్ జాన్సన్ మద్దతు ప్రకటించారు. విస్తృత రక్షణ, భద్రతా భాగస్వామ్యానికి ఇరుదేశాలు అంగీకరించాయని వెల్లడించారు. ఈ ఏడాది దీపావళి నాటికి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పూర్తి చేసే దిశగా పూర్తి ప్రయత్నాలు చేయాలని భారత్, బ్రిటన్ నిర్ణయం తీసుకున్నాయి.












Click it and Unblock the Notifications