తొలిసారి రూ.3,500 కోట్ల విలువైన 1500 కిలోల హెరాయిన్ పట్టివేత

1,500 కిలోల హెరాయిన్ తరలిస్తున్న వారిని కోల్‌కతా స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. దేశంలోనే తొలిసారిగా ఇంత భారీ మొత్తంలో డ్రగ్ పట్టుకోవడం గమనార్హం.

కోల్‌కతా: 1,500 కిలోల హెరాయిన్ తరలిస్తున్న వారిని కోల్‌కతా స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. దేశంలోనే తొలిసారిగా ఇంత భారీ మొత్తంలో డ్రగ్ పట్టుకోవడం గమనార్హం.

1500 కిలోల హెరాయిన్‌ను గుజరాత్‌ తీరప్రాంతానికి సమీపంలోని సముద్రజలాల్లో భారతీయ కోస్ట్‌గార్డ్‌ స్వాధీనం చేసుకుంది. దీని విలువ రూ. 3500 కోట్లు.

కిలో హెరాయిన్‌ విలువ కిలో బంగారం కంటే తొమ్మిదిరెట్లు ఎక్కువ. కిలో బంగారం ధర రూ. 27 లక్షల వరకు ఉండగా.. కిలో హెరాయిన్‌ ధర రూ. 2.3 కోట్ల వరకు పలుకుతోంది. ఇంతస్థాయిలో డ్రగ్స్‌ను పట్టుకోవడం ఇదే తొలిసారి.

 Brother of captain of Gujarat vessel carrying 1,500 kg heroin detained in Kolkata

హెరాయిన్‌ తీసుకెళ్తున్న ఓ చిన్నపాటి పడవను సముద్ర పవక్ అనే నౌక, అంకిత్‌ అనే ట్రాలర్‌ వెంబడించి పట్టుకున్నాయి. నిఘావర్గాల నుంచి సమాచారం అందడంతో కోస్ట్‌గార్డ్‌ పక్కా ఆపరేషన్‌తో దాన్ని పట్టుకుంది.

ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌, ఇంటెలిజెన్స్‌ బ్యూరో, స్థానిక పోలీసులు, నౌకాదళ అధికారులు కలిసి సంయుక్తంగా విచారణ జరుపుతున్నారు. ఆ షిప్‌లో ఉన్న వాళ్లంతా భార‌తీయులే కావ‌డం గ‌మ‌నార్హం.

కాగా, అరెస్టైన వారిలో కెప్టెన్ సుప్రీత్ తివారి సోదరుడు కూడా ఉన్నాడని తెలుస్తోంది. సుప్రీత్ తివారి కోల్‌కతాకు చెందినవాడు. అరెస్టైన అతని సోదరుడి పేరు సుజిత్. వయస్సు 22. అతను బిటెక్ చదువుతున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+