Brother wife: వదిన ఒంటరిగా ఉందని మరిది రొమాన్స్, దెబ్బకు ఔట్, గిల్లి గిచ్చాడని ఫినిష్ !

చెన్నై/తిరువణ్నామలై: వదిన మీద కన్ను వేసిన ఓ కామాంధుడు ఆమెతో ఎంజాయ్ చెయ్యాలని ప్రయత్నించాడు. అన్న డ్యూటీకి వెళ్లిన సమయంలో అతని ఇంటికి వెళ్లిన తమ్ముడు వదినతో అసభ్యంగా ప్రవర్తించి ఆమెను గిల్లి గిచ్చాడు. మద్యం మత్తులో ఉన్న మరిది చేస్తున్న చేష్టలతో వదిన చాలాసేపు ఓర్చుకుని సైలెంట్ గా ఉండిపోయింది. అర్దరాత్రి ఏమి జరిగిందో ఏమో కాని పదునైన కత్తి తీసుకున్న వదిన ఆమె మరిదిని చంపేసింది. పక్కరూమ్ లో తన కుమార్తెలు ఉన్నారని, తన మరిది తన మీద అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించడంతో చంపేశానని ఆమె పోలీసులకు చెప్పింది. వదినను రేప్ చెయ్యడానికి వెళ్లిన మరిది హత్యకు గురి కావడం కలకలం రేపింది.

 అన్న ట్రక్కు డ్రైవర్

అన్న ట్రక్కు డ్రైవర్

తమిళనాడులోని తిరుణ్ణామలై జిల్లాలోని సెంగం సమీపంలోని తలవనాయకన్ పేట్ లో సెల్వం (50) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. సెల్వంకు భార్య పరాశక్తి (45), ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సెల్వం ట్రక్కు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. సెల్వంకు రాజా (47) అనే తమ్ముడు ఉన్నాడు. సెల్వం నివాసం ఉంటున్న ప్రాంతంలోనే అతని తమ్ముడు రాజా కూడా నివాసం ఉంటున్నాడు.

 భార్య వదిలేసిందని వదిన మీద కన్ను

భార్య వదిలేసిందని వదిన మీద కన్ను

సెల్వం ట్రక్కు డ్రైవర్ కావడంతో నెల రోజులు డ్యూటీ చేసి నెల రోజులు ఇంటి దగ్గర ఉంటున్నాడు. నెల రోజు ముందు డ్యూటీకి వెళ్లిన సెల్వం లాక్ డౌన్ లో వేరే రాష్ట్రంలో ఉండిపోయాడు. రాజా తాగుబోతు కావడంతో అతని భార్య అతన్ని వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకునిందని సమాచారం. భర్త వదిలేయడంతో ఒంటరిగా ఉంటున్న రాజా అన్న సెల్వం భార్య పరాశక్తి మీద కన్ను వేశాడు.

 వదినతో సరాలు ఆడాలని స్కెచ్

వదినతో సరాలు ఆడాలని స్కెచ్

తన అన్న సెల్వం కూడా డ్యూటీకి వెళ్లిపోయాడని, తన వదిన ఒంటరిగా ఉందని, వెళ్లి ఆమెతో ఎంజాయ్ చెయ్యాలని బావించిన రాజా పీకలదాక మద్యం సేవించి వెళ్లాడు. రాత్రి భోజనం చేసిన పరాశక్తి నిద్రపోయింది. పరాశక్తి పడుకున్న రూమ్ పక్కలోని మరో రూమ్ లో ఆమె ఇద్దరు కూతుర్లు నిద్రపోయారు. నేరుగా వదిన పరాశక్తి ఉన్న రూమ్ లోకి రాజా దూరిపోయాడు.

 వదినను గిల్లి గిచ్చిన మరిది

వదినను గిల్లి గిచ్చిన మరిది

మద్యం మత్తులో వెళ్లిన రాజా అతని వదిన పరాశక్తిని లైంగిక వేధింపులకు గురి చేశాడు. మద్యం మత్తులో ఉన్న మరిది చేష్టలు చూసిచూడనట్లు అతని వదిన ఉండిపోయింది. ఇదే మంచి చాన్స్ అంటూ రాజా అతని వదినను గిల్లడం గిచ్చడం చేశాడు. గొడవ జరిగితే పక్కరూమ్ లో ఉన్న అమ్మాయిలకు తెలుస్తోందని, లేనిపోని రామాయణం అవుతోందని పరాశక్తి చాలా ఓపిక పట్టింది.

Recommended Video

    Hyderabad : చేప మందు పై బత్తిన సోదరుల క్లారిటీ!!
     రేప్ చెయ్యాలని చూశాడు చంపేశాను

    రేప్ చెయ్యాలని చూశాడు చంపేశాను

    అర్దరాత్రి ఏమి జరిగిందో ఏమో కాని పరాశక్తి పదునైన కత్తి తీసుకుని మరిది రాజాను పొడిచి చంపేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. అర్దరాత్రి తన రూమ్ లోకి వచ్చి తనను రేప్ చెయ్యడానికి ప్రయత్నించాడని, అందుకే తన మరిదిని చంపేశానని పరాశక్తి సెంగం పోలీసులకు చెప్పింది. సొంత వదిన చేతిలో మరిది దారుణ హత్యకు గురి కావడం కలకలం రేపింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+