వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

130 కోట్ల మంది ఆశీస్సులు తీసుకొచ్చా -సర్జికల్‌ స్ట్రైయిక్స్ గర్వ కారణం : సైనికులతో ప్రధాని దీపావళి..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

జమ్మూకశ్మీర్‌లోని నౌషెరా సెక్టార్‌లో ప్రధాని దీపావళి వేడుకలను జవాన్లతో జరుపుకుంటున్నారు. దేశానికి సైన్యం సురక్షా కవచమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పండుగ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా ప్రధాని ఇవాళ సైనికులతో కలిసి దీపావళి వేడుకలను జరుపుకున్నారు. జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి సెక్టార్‌లోని సైనిక శిబిరాల్లో నిర్వహించే దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. 2014 నుంచి ఏటా సైనికులతో ప్రధాని దీపావళి వేడుకలు జరుపుకుంటున్నారు.

అమర జవాన్లకు నివాళి

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్లకు ప్రధాని నివాళులర్పించారు. సైనికుల కోసం 130కోట్ల మంది ప్రజల ఆశీస్సులు తీసుకువచ్చానని, తాను ప్రధానిగా రాలేదని, మీ కుటుంబ సభ్యుడిగా వచ్చానని అన్నారు. సైన్యం ధైర్యసాహసాలు దీపావళికి మరింత శోభను తీసుకువచ్చాయని కొనియాడారు. ప్రతి దీపావళి సైనికులతోనే జరుపుకుంటున్నానని.. జవాన్ల మధ్య పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు.వీరత్వానికి ఈ ప్రాంతం సజీవ తార్కాణమని, సైనికుల వల్లే ప్రజలు ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారన్నారు.

సర్జికల్స్ స్ట్రైక్స్ అంశం ప్రస్తావన


ప్రతికూల పరిస్థితుల్లోనూ దేశానికి సైనికులు రక్షణగా నిలుస్తున్నారని అభినందించారు. సర్జికల్‌ స్ట్రయిక్స్‌లో సైన్యం పాత్ర దేశానికే గర్వకారణమన్నారు. సైన్యానికి అత్యాధునిక ఆయుధ సామగ్రి సమకూరుస్తున్నామని.. తేజస్‌, అర్జునలాంటి ఆయుధాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. భార‌త జ‌వాన్లు శ‌తృవుల‌కు ధీటైన జ‌వాబు ఇస్తున్నార‌ని, సైనికుల సాహ‌సాలు దీపావ‌ళి వేడుక‌ల‌కు మ‌రింత వ‌న్నె తీసుకొచ్చాయ‌ని తెలిపారు. బోర్డ‌ర్‌లో సైనికులు ప‌హారా కాస్తుండ‌టం వ‌ల‌నే దేశంలోని ప్ర‌జ‌లు సుఖంగా నిద్ర‌పోతున్నార‌ని అన్నారు.

వీరత్వానికి ఆ ప్రాంతం సజీవ తార్కాణమంటూ


ఇక విదేశాల నుంచి ఆయుధాల కోనుగోలు త‌గ్గింద‌ని, 200 ర‌కాల ఆయుధాలు, ప‌రిక‌రాలు దేశంలోనే త‌యార‌వుతున్నాయ‌ని అన్నారు. వ‌ర‌ల్డ్ క్లాస్ ఆయుధాలు భార‌త్ లోనే త‌యార‌వుతున్నాయ‌ని, త్వ‌ర‌లోనే ప్ర‌పంచ దేశాల‌కు ఎగుమ‌తి చేసే స్థాయికి ఎదుగుతామ‌ని ప్ర‌ధాని మోదీ వివరించారు. వీరత్వానికి ఈ ప్రాంతం సజీవ తార్కాణమని.. ప్రతికూల పరిస్థితుల్లోనూ దేశానికి సైనికులు రక్షణగా నిలుస్తున్నారని అభినందించారు.అన్నిరంగాల్లో మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నామని.. ఇప్పటికే నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో మహిళలు రాణిస్తున్నారని గుర్తు చేశారు.

Recommended Video

నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని కేంద్రంపై కేసీఆర్ ఒత్తిడి తేవాలి

జవాన్లకు స్వీట్లు తినిపిస్తూ..వారితో కలిసిపోయి

సైన్యంలో మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. సైనిక పాఠశాలల్లో బాలికలకు అవకాశం కల్పిస్తున్నామని.. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ, మిలటరీ కాలేజీల్లోనూ మహిళలకు ప్రవేశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. జన్మభూమిని మించిన స్వర్గం లేదని మోదీ అన్నారు. జననీ జన్మభూమిశ్చ.. స్వర్గాదపీ గరియసీ అని రాముడే చెప్పాడన్నారు. సైన్యం కేవలం కేవలం సరిహద్దుల్లోనే కాపలా కాయడం లేదని, రాష్ట్రాలకు కూడా సైన్యం రక్షణగా నిలుస్తుందన్నారు. అనంతరం సైనికులతో కలిపి ఫొటోలు దిగారు. ఆ తర్వాత జవాన్లకు ప్రధాని స్వీట్లు తినిపించారు.

English summary
PM Modi celebrated Diwali with Jawans at Jammu. He said that he had brought 130 crore indians blessings along with him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X