మధ్యప్రదేశ్ లో మానవ మృగాలు : ఇండోర్ లో స్టూడెంట్ పై గ్యాంగ్ రేప్, బేతుల్ లో మైనర్ బాలికపై రేప్
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం మహిళలపై నేరాల నియంత్రణ కోసం ఎంతగా ప్రయత్నం చేస్తున్నా, పదిహేను రోజులపాటు సమ్మాన్ కార్యక్రమం ద్వారా మహిళలపై జరుగుతున్న నేరాల నియంత్రణ కోసం వివిధ అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తరుణంలో కూడా మహిళలపై వరుస అత్యాచార ఘటనలు చోటుచేసుకోవడం మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి.

బేతుల్ లో 14 ఏళ్ల బాలికపై అత్యాచారం.. ఆపై హత్యా యత్నం
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బేతుల్ లో 14 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. పొలంలో మోటార్ స్విచ్ ఆఫ్ చేయడానికి వెళ్లిన బాలికను ఒంటరిగా చూసిన ఒక వ్యక్తి ఆమెపై అత్యాచారం చేశాడు. అంతేకాదు ఆమెను ఒక నీళ్ల ట్యాంకులో పడవేసి రాళ్లతో కప్పి సజీవంగా పాతి పెట్టే ప్రయత్నం కూడా చేశాడు. అయితే ఆ తర్వాత బాలిక ఎంతకీ తిరిగి రాకపోవడంతో బాలికను వెతికిన కుటుంబ సభ్యులు తీవ్రగాయాలతో నీళ్ల ట్యాంకులో మూలుగుతున్న బాలికను గమనించి వారు ఆమెను ఆసుపత్రికి తరలించారు.

బాలిక ప్రైవేట్ భాగాల్లో తీవ్ర గాయాలు .. నిందితుడు అరెస్ట్
బాలిక ప్రైవేట్ భాగాలు, దవడ భాగం తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం ఆమెను నాగపూర్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో 35 ఏళ్ల నిందితుడిని అరెస్ట్ చేశామని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం నిబంధనల ప్రకారం, ఐపీసీ లోని వివిధ సెక్షన్ల క్రింద అత్యాచారం కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు.
ఇక మరో ఘటన ఇండోర్ లో చోటుచేసుకుంది. 19 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేసి, ఆమెను కత్తితో పొడిచి, సంచిలో బంధించి, రైల్వే ట్రాక్ పై విసిరిన ఘటన ఇండోర్ లో చోటుచేసుకుంది.

ఇండోర్ లో యువతిపై సామూహిక అత్యాచారం .. పొడిచి సంచిలో బంధించి ఆపై
ఈ ఘటనలో పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం నిందితుడు యువతి మాజీ ప్రేమికుడు ఆమెను నందిగ్రామ్ లోని ఒక ఫ్లాట్ కు తీసుకువెళ్ళాడు, అక్కడ అతను తన స్నేహితులతో కలిసి అత్యాచారం చేశాడు.
ఆమె వారిని వారించినప్పటికీ బలవంతంగా ఆమెను సామూహిక అత్యాచారం చేశారు. ఆపై వారు ఆమెను పొడిచి, ఆమెను ఒక సంచిలో ప్యాక్ చేసి, భగీరత్ పుర లోని రైల్వే ట్రాక్ కు తీసుకెళ్లారు. రైల్వే ట్రాక్ పై ఆ సంచిని విసిరి వేసి వెళ్లిపోయారు.

రైల్వే ట్రాక్ పై తీవ్ర గాయాలతో యువతి .. ఆస్పత్రికి తరలింపు
అది గమనించిన స్థానికులు సంచీలో తీవ్రగాయాలతో ఉన్న యువతిని ఇండోర్లోని ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనలో నిందితులను అదుపులోకి తీసుకున్నామని, రెండు కత్తి కోట్లతో గాయాలపాలైన యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని పోలీసులు వెల్లడించారు.
ఈ నెలలో ఇప్పటి వరకు ఇలాంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా అనేకం చోటు చేసుకున్నాయి. మహిళలపై వరుసగా చోటుచేసుకుంటున్న అత్యాచార ఘటనలు శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వానికి ఊపిరాడనివ్వడం లేదు.

మహిళల రక్షణ కోసం సమ్మాన్ కార్యక్రమం జరుగుతున్న తరుణంలోనే దారుణాలు
మహిళల రక్షణ కోసం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అత్యాచార ఘటనలు నిత్యకృత్యంగా మారిపోయాయి. మహిళల రక్షణ కోసం అవగాహన కల్పిస్తున్నా సమ్మాన్ కార్యక్రమం జరుగుతున్న తరుణంలోనే వరుస ఘటనలు చోటు చేసుకోవడం మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.
మరో ఘటన ఇండోర్ లో చోటుచేసుకుంది. 19 ఏళ్ల స్టూడెంట్ పై సామూహిక అత్యాచారం చేసి, ఆమెను కత్తితో పొడిచి, సంచిలో బంధించి, రైల్వే ట్రాక్ పై విసిరిన ఘటన ఇండోర్ లో చోటుచేసుకుంది.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications