మోడీ తరహలోనే యడ్యూరప్ప: విధానసభ వద్ద భావోద్వేగం, ప్రమాణం
బెంగుళూరు: కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా బిఎస్ యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విధానసౌధకు గురువారం నాడు వచ్చారు. ఈ సందర్భంగా యడ్యూరప్ప భావోద్వేడానికి గురయ్యారు. విధానసౌధ మెట్లను చేతులతో తాకి ప్రమాణం చేశారు. 2014లో పార్లమెంట్లోకి నరేంద్ర మోడీ ఏ తరహలో వెళ్ళారో అదే తరహలో యడ్యూరప్ప కూడ విధాన సభలోకి అడుగుపెట్టారు.
2014లో జరిగిన ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ఘన విజయం సాధించింది. ఈ విజయం తర్వాత ప్రధానమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత తొలిసారిగా పార్లమెంట్లోకి అడుగుపెట్టే సమయంలో నరేంద్ర మోడీ భావోద్వేగానికి గురయ్యారు.

పార్లమెంట్ మెట్లను తాకి ప్రమాణం చేశారు.మోడీ తరహలోనే కర్ణాటక సీఎం యడ్యూరప్ప కూడ విధాన సభ మెట్లను తాకి భావోద్వేగానికి గురయ్యారు. ఈ మెట్లను తాకి ప్రమాణం చేశారు.
యడ్యూరప్ప కర్ణాటక రాష్ట్రానికి మూడో దఫా ముఖ్యమంత్రిగా గురువారంనాడు బాధ్యతలను స్వీకరించారు. అయితే ఈ దఫా కనీస మెజార్టీకి 8 మంది ఎమ్మెల్యేల దూరంలో బిజెపి ఉండిపోయింది. ఈ తరుణంలో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన యడ్యూరప్ప 15 రోజుల్లో తన బలాన్ని నిరూపించుకోవాల్సి వచ్చింది.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications