మోదీ మనసులో ఏముందో నీకు తెలుసా, నాకు తెలుసా ?, మాజీ సీఎం సూటి ప్రశ్నతో షాక్ !
న్యూఢిల్లీ/ బెంగళూరు: ఢిల్లీలో జరిగిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి హాజరైన తర్వాత కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప గురువారం బెంగళూరుకు తిరిగి వచ్చారు. జేడీఎస్‌తో పొత్తు గురించి మాట్లాడలేదు. బీజేపీ హైకమాండ్ నిర్ణయానికి రాష్ట్ర నేతలు కట్టుబడి ఉంటారని మాజీ సీఎం యడ్యూరప్ప అన్నారు.
ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత నగరంలోని డాలర్స్ కాలనీలోని తన నివాసం దగ్గర విలేకరులతో మాట్లాడిన బీఎస్ యడ్యూరప్ప జేడీఎస్ తో పొత్తు విషయంలో నిర్ణయం తీసుకునే ముందు బీజేపీ హైకమాండ్ రాష్ట్ర నేతలను సంప్రదించవచ్చని అన్నారు. నిన్న జీ20, మధ్యప్రదేశ్ ఎన్నికల గురించి మాత్రమే చర్చ జరిగింది. మరేదైనా చర్చించడానికి సమయం లేదు, కర్ణాటకపై చర్చ జరగలేదని యడియూరప్ప అన్నారు.

మనకంటే ఢిల్లీ నేతలు చెప్పేదే ముఖ్యం. నిర్ణయం తీసుకునే ముందు వారు మమ్మల్ని సంప్రదిస్తారు. నా వ్యక్తిగత అభిప్రాయం చెప్పలేను. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం'అని మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప అన్నారు. ఈ విషయాన్ని హైకమాండ్ సమావేశంలో ప్రస్తావించలేదని, త్వరలోనే పూర్తి సమాచారం తెలుస్తుందని బీఎస్ యడియూరపకప అన్నారు.

2024 లోక్‌సభ ఎన్నికల కోసం రాష్ట్రంలో బీజేపీ, జేడీఎస్‌లు పొత్తు పెట్టుకుంటాయని గత వారం మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప చెప్పారు. ప్రాంతీయ పార్టీకి నాలుగు సీట్లు ఇచ్చేందుకు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అంగీకరించినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే దీనికి కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నాయకుడు హెచ్ డీ. కుమారస్వామి అంగీకరించలేదని చెబుతున్నారు.
వినాయక చవితి పండుగ తర్వాత బీజేపీతో చర్చలు జరపవచ్చని జేడీఎస్ లెజిస్లేచర్ పార్టీ నేత హెచ్‌డీ కుమారస్వామి సూచనప్రాయంగా ఇటీవల వెల్లడించారు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటకలో ఘోర పరాజయాన్ని చవిచూసిన బీజేపీ, జేడీఎస్ పార్టీలు పుంజుకునే ప్రయత్నం చేస్తున్నాయి. బీజేపీతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ మీద ప్రతీకారం తీర్చుకోవాలని జేడీఎస్ కు చెందిన కొందరు నాయకులు అనుకుంటున్నారని తెలిసింది.












Click it and Unblock the Notifications