బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

MLA: యడియూరప్ప రాజీనామా, సొంతపార్టీ ఎమ్మెల్యే సంబరాలు, తిట్టకపోతే అన్నం తినడు, రాత్రి నిద్రరాదు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన బీఎస్. యడియూరప్పను చూసి చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కేంద్ర మంత్రులు జాలి చూపిస్తున్నారు. ఇక బీఎస్. యడియూరప్పను చూసి కర్ణాటకలోని బీజేపీ కార్యకర్తలు అయ్యోపాపం అంటున్నారు. అయితే బీఎస్. యడియూరప్ప సీఎం పదవికి రాజీనామా చెయ్యడంతో సొంతపార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే సంబరాలు చేసుకుంటున్నారు. యడియూరప్ప సీఎం పదవికి రాజీనామా చేసిన వెంటనే వరైటీగా సంబరాలు చేసుకున్న ఆ బీజేపీ ఎమ్మెల్యే హమ్మయ్యా, నేను ఆ దేవుడిని కోరుకున్న వరం తీర్చేశాడు అంటూ ఎగిరి గంతేస్తున్నాడు. అన్నట్లు ఆ బీజేపీ సీనియర్ ఎమ్మెల్యేకి ప్రతిరోజూ యడియూరప్పను, ఆయన కొడుకును తిట్టకపోతే ఆ ఎమ్మెల్యేకి అన్నం దిగదు, రాత్రి నిద్రరాదు.

Illegal affair: భార్య ప్రియుడు, మర్మాంగాన్ని తుపాకితో కాల్చేసిన భర్త. గుత్తి ఢమాల్, ఇప్పుడు చెయ్యి !Illegal affair: భార్య ప్రియుడు, మర్మాంగాన్ని తుపాకితో కాల్చేసిన భర్త. గుత్తి ఢమాల్, ఇప్పుడు చెయ్యి !

బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే

బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే

కర్ణాటకలో బీజేపీ సీనియర్ ఎమ్మెల్యేల్లో విజయపుర నియోజక వర్గం శాసన సభ్యుడు బసవనగౌడ పాటిల్ యత్నాల్ కూడా ఒకరు. 2019 జులై 26వ తేదీన బీఎస్. యడియూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రి అయిన తరువాత సీఎంతో బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాల్ బాగానే ఉన్నారు. తరువాత సీన్ మారిపోయింది.

సీంఎంతో ఎవరైనా చాలెంజ్ చేస్తారా ?

సీంఎంతో ఎవరైనా చాలెంజ్ చేస్తారా ?

అప్పట్లో కర్ణాటక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న బీఎస్. యడియూరప్ప మీద ప్రతిపక్షాలు విమర్శలు చెయ్యడం సర్వసాధారణంగా జరిగాయి. అయితే సొంతపార్టీకి చెందిన నాయకులు ఎవ్వరూ సీఎంను విమర్శించడానికి సాహసం చెయ్యలేకపోయారు. అయితే అప్పటి కర్ణాటక సీఎం బీఎస్. యడియూరప్పను సొంత పార్టీ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాల్ విమర్శించడంతో సొంత పార్టీ నాయకులు షాక్ అయ్యారు.

 సీఎంకు, కొడుక్కి తిట్లదండకం

సీఎంకు, కొడుక్కి తిట్లదండకం

అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప మీద బీజేపీ ఎమ్మెల్యే యత్నాలు రానురాను విమర్శలు చేశారు. మంత్రి పదవి రాకపోవడం, ఆయన నియోజక వర్గానికి నిధులు తక్కువగా విడుదల కావడంతో యత్నాల్ రగిలిపోయాడు. అప్పటి కర్ణాటక సీఎం బీఎస్. యడియూరప్పతో పాటు ఆయన కొడుకు బీవై. విజయేంద్ర మీద ప్రతిరోజు బీజేపీ ఎమ్మెల్యే యత్నాల్ తిట్ల వర్షం కరుపించారు.

సీఎంను, కొడుకును తిట్టకపోతే అన్నం తినడు.... రాత్రి నిద్రపోడు

సీఎంను, కొడుకును తిట్టకపోతే అన్నం తినడు.... రాత్రి నిద్రపోడు

అప్పటి కర్ణాటక సీఎం బీఎస్. యడియూరప్పకే బహిరంగంగా చాలెంజ్ లు చేసిన యత్నాల్ కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యారు. రానురాను యడియూరప్పతో పాటు ఆయన కొడుకు విజయేంద్రను ఇష్టం వచ్చినట్లు తిట్టడం మొదలుపెట్టారు. కరోనా వైరస్ మహమ్మారి టైమ్ లో, లాక్ డౌన్ సమయంలో మీడియాకు ఫోన్లు చేసి ప్రభుత్వ తీరుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, సీఎం పని తీరుబాగాలేదని విమర్శలు చేసి రచ్చరచ్చ చేశారు. ప్రతిరోజు స్నానం చేసి బయటకు వెళ్లిన యత్నాల్ యడియూరప్ప, ఆయన కొడుకు విజయేంద్రను తిట్టకుండా అన్నం తినడు, రాత్రి నిద్రపోడు అనే టైపులో పరిస్థితి ఎదురైయ్యింది.

యడియూరప్ప రాజీనామా చేసే వరకు గడ్డం తియ్యను

యడియూరప్ప రాజీనామా చేసే వరకు గడ్డం తియ్యను

రానురాను యడియూరప్ప, యత్నాల్ ల విమర్శల పర్వం తారాస్థాయికి చేరింది. యడియూరప్ప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే వరకు తాను గడ్డం గీచుకోనని చాలెంజ్ చేసిన యత్నాల్ బాబా లాగా గడ్డం వదిలేశాడు. జులై 26వ తేదీన యడియూరప్ప సీఎం పదవికి రాజీనామా చేసినా యత్నాల్ మాత్రం గడ్డం తియ్యలేదు. ఎందుకంటే యడియూరప్ప ఇంకా అపద్దర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా అని యత్నాల్ కు ఆవేదన. అయితే బుధవారం బసవరాజ్ బోమ్మయ్ కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత యత్నాల్ గడ్డం గీచుకుని మీడియా ముందుకు హుషారుగా వచ్చేశారు.

దేవుడు ఉన్నాడు..... నా కోరిక తీరింది

దేవుడు ఉన్నాడు..... నా కోరిక తీరింది

నేను కోరుకున్న మొక్కు తీరిపోయింది. భగవంతుడు నాకోరిక మర్నించాడు, హైకమాండ్ కూడా నా డిమాండ్ తీర్చుతూ యడియూరప్పతో రాజీనామా చేయించింది. ఇక ముందు ప్రతినిత్యం తాను గడ్డం గీచుకుని స్మార్టుగా మీ ముందుకు వస్తానని మీడియా ముందు బసవనగౌడ పాటిల్ యత్నాల్ హుషారుగా మాట్లాడారు. మొత్తం మీద యడియూరప్ప రాజీనామాతో బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే యత్నాల్ సంబరాలు చేసుకుంటున్నారు.

English summary
BS Yediyurappa Resignation, How Senior BJP MLA Basanagouda Patil Yatnal Celebrated in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X