బంఫర్ ఆఫర్ :రూ.49 లకే, అపరిమిత కాల్స్ ను ప్రకటించిన బిఎస్ఎన్ఎల్
ల్యాండ్ లైన్ వినియోగదారులను ఆకర్షించేందుకుగాను బిఎస్ఎన్ఎల్ ఆపర్లను ప్రకటించింది.అపరిమతి ఫోన్ కాల్స్ ధరను రూ.49 చెల్లించి పొందవచ్చని బిఎస్ఎన్ ఎల్ ప్రకటించింది.
న్యూఢిల్లీ:సెల్ ఫోన్ల రాకతో ల్యాండ్ లైన్ ఫోన్లు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది.అయితే ల్యాండ్ లైన్ వినియోగదారులను పెంచుకొనేందుకు బిఎస్ఎన్ ఎల్ ఆఫర్లను ప్రకటిస్తోంది.
సెల్ ఫోన్ల రాకతో ల్యాండ్ ఫోన్లు వాడడం దాదాపుగా మానేసే పరిస్థితిలోకివచ్చాం. ప్రతి ఒక్కరూ రెండు మూడు సెల్ ఫోన్లను ఉపయోగిస్తున్నారు. కాని, ఇంట్లో మాత్రం ల్యాండ్ ఫోన్లనుమాత్రం ఉపయోగించడం లేదు.
ల్యాండ్ లైన్ ఫోన్లతో అత్యధికంగా వినియోగదారులు ఉన్న బిఎష్ ఎన్ ఎల్ ఆపర్లను ప్రకటిస్తూ వినియోగదారులను పెంచుకొనే ప్రయత్నం చేస్తోంది.
రూ.49 లకే అపరిమిత కాల్స్

ల్యాండ్ లైన్ వినియోగదారులను పెంచుకొనేందుకుగాను ఇప్పటికే కొన్ని పథకాలకు బిఎస్ఎన్ఎల్ శ్రీకారం చుట్టింది.అయితే బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్లు ల్యాండ్ ఫోన్ వినియోగదారులకు మాత్రమే ఇస్తోంది బిఎస్ఎన్ ఎల్.ప్రతి ఆదివారం నాడు రాత్రి 9 గంటల నుండి ఉదయం 7 గంటలలోపు ల్యాండ్ ఫోన్ నుండి ఏ నెట్ వర్క్ కు అయినా అపరిమితంగా కాల్స్ చేసుకొనే అవకాశాన్ని కల్పించింది బిఎస్ఎన్ ఎల్.
అయితే దీని కోసం ప్రతి నెల సుమారు .99 రూపాయాలను వసూలు చేస్తున్నారు.అయితే దీన్ని ఇక నుండి రూ.49 లకే తగ్గించింది బిఎస్ఎన్ ఎల్.కొత్త వినియోగదారులను ఆకర్షించేందుకే బిఎస్ఎన్ఎల్ ఆపర్లను ప్రకటించింది.












Click it and Unblock the Notifications